U19 WC 2026: రాణించిన అభిజ్ఞాన్, వైభవ్.. బంగ్లాదేశ్ టార్గెట్ 239..
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:35 PM
అండర్ 19 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కుర్రాళ్లు.. 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటయ్యారు..
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు భారత్-బంగ్లాదేశ్ జట్లు బులవాయో వేదికగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కుర్రాళ్లు.. 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటయ్యారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 49 ఓవర్లకు కుదించారు. అభిజ్ఞాన్ కుందు (80; 112 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు), వైభవ్ సూర్యవంశీ (72; 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) రాణించారు. ఆరంభంలో 12 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను.. వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి ఆదుకున్నాడు. 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వైభవ్ పెవిలియన్ చేరగా.. మళ్లీ ఆట గాడి తప్పింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అభిజ్ఞాన్ కుందు.. జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
30 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న వైభవ్.. తర్వాత నెమ్మదిగా ఆడగా ఐదో స్థానంలో బ్యాటర్‌గా వచ్చిన అభిజ్ఞాన్ నిలకడగా బౌండరీలు రాబట్టాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 99 బంతుల్లో 62 పరుగులు జోడించింది. హుస్సేన్ ఎమోన్ వరుస ఓవర్లలో వైభవ్, హరివంశ్ (2)ను పెవిలియన్‌కు పంపడంతో 119/5తో భారత్ మరోసారి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అభిజ్ఞాన్, కనిష్క్ 45 బంతుల్లో 54 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.
39 ఓవర్ల తర్వాత మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం తగ్గి తిరిగి ఆట మొదలయ్యాక భారత్ 46 పరుగులు చేసి.. నాలుగు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహద్ 5, ఇక్బాల్ 2, హకీమ్ తమీమ్ 2, పావెజ్ జిబోన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ముదిరిన భారత్-బంగ్లా వివాదం.. ఆటగాళ్ల నో హ్యాండ్ షేక్
ఐసీసీ అధికారికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్.!