Steve Smith: బాబర్‌తో ఎలాంటి విభేదాల్లేవు.. స్పష్టం చేసిన స్టీవ్ స్మిత్
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:28 PM
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజామ్ మధ్య జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో వీరిద్దరికీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై స్మిత్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజామ్ ఆడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన మ్యాచులో వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో వీరిద్దరికీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై స్మిత్(Steve Smith) స్పందించాడు.
బాబర్ ఆజామ్(Babar Azam)తో తనకు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను స్మిత్ తీవ్రంగా ఖండించాడు. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేం బాగానే ఉన్నాం. మ్యాచ్ తర్వాత మేమిద్దరం గోల్ఫ్ గురించి మాట్లాడుకున్నాం. గత మ్యాచులో బాబర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మేం ఇద్దరం కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాం’ అని స్మిత్ వెల్లడించాడు.
అసలేమైందంటే..
సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ వ్యక్తిగత స్కోరు 47 వద్ద ఉన్న సమయంలో 11వ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే.. స్మిత్ దానికి నిరాకరించాడు. దీంతో బాబర్ స్పష్టంగా అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత 12వ ఓవర్ నుంచి సిక్సర్స్ పవర్ సర్జ్ తీసుకోగా, స్మిత్ ఏకంగా ఒకే ఓవర్‌లో 32 పరుగులు సాధించి సెంచరీ చేశాడు. అదే సమయంలో 13వ ఓవర్ తొలి బంతికే బాబర్ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. నిరాశలో బ్యాట్‌తో బౌండరీ కుషన్లను కొడుతూ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి:
రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్