India Open Badminton: విజేతలు యంగ్, లిన్
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:08 AM
ప్రపంచ నెంబర్‌వన్ అన్ సే యంగ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ దక్షిణ కొరియా సంచలనం ఇండియా ఓపెన్ మహిళల సింగిల్స్...
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ: ప్రపంచ నెంబర్‌వన్ అన్ సే యంగ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఈ దక్షిణ కొరియా సంచలనం ఇండియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్, డిఫెండింగ్ చాంప్ అన్ సే యంగ్ 21-13, 21-11తో చైనాకు చెందిన ప్రపంచ నెంబర్ టూ షట్లర్ వాంగ్ జియిని ఓడించి సీజన్‌లో వరుసగా రెండో ట్రోఫీని దక్కించుకుంది. గతవారం మలేసియా ఓపెన్‌లోనూ యంగ్ విజేతగా నిలిచింది. ఇండియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లిన్ చున్ యి (చైనీస్ తైపీ) సాధించాడు. తుదిపోరులో లిన్ 21-10, 21-18తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచాడు.
ఇవి కూడా చదవండి..
మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్
అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318