Australian Open 2026: టాప్‌సీడ్ల శుభారంభం
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:05 AM
టాప్‌సీడ్లు కార్లోస్ అల్కారజ్, అర్యాన సబలెంక ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. అయితే 45 ఏళ్ల వయస్సులో గ్రాండ్‌స్లామ్‌లో పాల్గొంటున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన...
ఆస్ట్రేలియన్ ఓపెన్
అల్కారజ్, సబలెంక ముందంజ
తొలి రౌండ్‌లోనే వీనస్ అవుట్
మెల్‌బోర్న్: టాప్‌సీడ్లు కార్లోస్ అల్కారజ్, అర్యాన సబలెంక ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. అయితే 45 ఏళ్ల వయస్సులో గ్రాండ్‌స్లామ్‌లో పాల్గొంటున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. 11వ సీడ్ అలెగ్జాండ్రోవాకు కూడా షాక్ తగిలింది. నిరుటి రన్నరప్, ప్రపంచ నెంబర్ వన్ సబలెంక 6-4, 6-1తో ఫ్రాన్స్‌కు చెందిన తియంత్సోవ సారాను ఓడించింది. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో వరల్డ్ నెంబర్‌వన్ అల్కారజ్ 6-3, 7-6 (2), 6-2తో ఆడమ్ వాల్టన్‌పై, గతేడాది రన్నరప్ జ్వెరెవ్ 6-7 (7), 6-1, 6-4, 6-2తో గాబ్రియెల్ డియాలోపై గెలుపొందాడు. మహిళల తొలి రౌండ్‌లో సోన్మెజ్ (టర్కీ) 7-5, 4-6, 6-4తో 11వ సీడ్ ఎకటరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)ను కంగుతినిపించింది. ఏడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత వీనస్ విలియమ్స్ (అమెరికా)ను 6-7 (7), 6-3, 6-4తో 24 ఏళ్ల డానిలోవిచ్ (సెర్బియా) కంగుతినిపించింది. ఏడో సీడ్ పోలిని 6-1, 6-2తో సస్నోవిచ్‌పై, స్విటోలినా 6-4, 6-1తో బుక్సాపై, రదుకాను 6-4, 6-1తో సవన్‌కేయెబ్‌పై నెగ్గారు.
ఇవి కూడా చదవండి..
మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్
అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318