Virat Kohli: రికార్డులకే కింగ్.. సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ!
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:24 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపించుకున్నాడు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో మెరిసిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను నిరూపించుకున్నాడు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో మెరిసిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే.
338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 296కే ఆలౌటైంది. కోహ్లీ124 పరుగులతో పోరాడాడు. అయినా జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే సిరీస్ ఓడినా.. విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్రం చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌పై చేసిన సెంచరీ.. అతడి వన్డే కెరీర్‌లో 54వ శతకం కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 85వ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో అత్యధిక సెంచరీల జాబితాలో అతడు ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(49) రెండో స్థానంలో ఉన్నాడు.
35 వేదికల్లో వన్డే శతకాలు..
ఇండోర్ హోల్కర్ స్టేడియంలో కోహ్లీకి ఇదే తొలి వన్డే శతకం. దీంతో వన్డే క్రికెట్‌లో 35 వేర్వేరు వేదికల్లో శతకాలు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (34 వేదికలు) పేరిట ఉండేది. న్యూజిలాండ్‌తో ఆఖరి వన్డేలో కోహ్లీ.. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే ఇండోర్ వేదికగా ఓ భారత ఆటగాడు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా కోహ్లీదే. వన్డేల్లో అత్యధిక వేదికల్లో శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(26 వేదికలు) మూడో స్థానంలో ఉండగా, 21 వేదికల్లో శతకాలు చేసిన రికీ పాంటింగ్, హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
భారత్ ఓటమి.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: సునీల్ గావస్కర్