Share News

Australian Open 2026: జొకో ‘సెంచరీ’

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:34 AM

దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన జొకో తొలి రౌండ్‌ను...

Australian Open 2026: జొకో ‘సెంచరీ’

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

మెల్‌బోర్న్‌ పార్క్‌లో 100వ విజయం

స్వియటెక్‌, గాఫ్‌, ఆండ్రీవా ముందంజ

మెల్‌బోర్న్‌: దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన జొకో తొలి రౌండ్‌ను సునాయాసంగా అధిగమించాడు. ఫేవరెట్‌ ఇగా స్వియటెక్‌ కూడా రెండో రౌండ్‌కు చేరింది. అయితే తొలి సెట్‌ గట్టెక్కేందుకు ఆమె శ్రమకోర్చాల్సి వచ్చింది. పురుషుల్లో 11వ సీడ్‌ మెద్వెదెవ్‌ 12వ సీడ్‌ రూడ్‌, 13వ సీడ్‌ రుబ్లేవ్‌ సైతం మొదటి రౌండ్‌లో అలవోక విజయాలు సాధించారు. మహిళల్లో మూడో సీడ్‌ కొకొ గాఫ్‌, నాలుగో సీడ్‌ అనిసిమోవా, ఆరో సీడ్‌ పెగులా, ఎనిమిదో సీడ్‌ ఆండ్రీవా మొదటి రౌండ్‌లో గెలుపొందారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో వరల్డ్‌ నెం.2 స్వియటెక్‌ 7-6 (5), 6-3తో చైనా క్వాలిఫయర్‌ యువాన్‌ యుయీపై కష్టపడి నెగ్గింది. మూడో సీడ్‌ కొకొ గాఫ్‌ 6-2, 6-3తో కమిల్లా రాఖిమోవాపై, నాలుగో సీడ్‌ అమందా అనిసిమోవా 6-3, 6-2తో వాల్టెర్ట్‌పై, ఆరో సీడ్‌ పెగులా 6-2, 6-1తో జఖరోవాపై, ఎనిమిదో సీడ్‌ ఆండ్రీవా 4-6, 6-3, 6-0తో వెకిక్‌పై నెగ్గి రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు.

నొవాక్‌ చరిత్ర

పదిసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత, నాలుగో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో 6-3, 6-2, 6-2తో పెడ్రో మార్టినెజ్‌ని వరుస సెట్లలో ఓడించాడు. ఈక్రమంలో 38 ఏళ్ల జొకో మెల్‌బోర్న్‌ పార్క్‌లో 100వ విజయం అందుకోవడం విశేషం. అంతేకాదు..మూడు భిన్న గ్రాండ్‌స్లామ్‌లలో 100 మ్యాచ్‌లు నెగ్గిన ఏకైక ఆటగాడిగా జొకోవిచ్‌ చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌లో నొవాక్‌ ఇప్పటికే సెంచరీ ఫీట్‌ నమోదు చేశాడు. 11వ సీడ్‌ మెద్వెదెవ్‌ 7-5, 6-2, 7-6 (2)తో డి జోంగ్‌ని, 12వ సీడ్‌ కాస్పెర్‌ రూడ్‌ 6-1, 6-2, 6-4తో బెలూసినీని, 13వ సీడ్‌ రుబ్లేవ్‌ 6-4, 6-2, 6-3తో అర్నాల్డీని, 14వ సీడ్‌ డవడోవిచ్‌ 6-2, 6-3, 6-3తో మిసోలిచ్‌ని ఓడించి ముందంజ వేశారు. ఏడో సీడ్‌ అలియాసిమ్‌ 6-3, 4-6, 4-6తో వెనుకంజలో ఉన్న దశలో గాయంతో ప్రత్యర్థి బోర్గె్‌సకు వాకోవర్‌ ఇచ్చాడు. 21వ సీడ్‌ షపోవలోవ్‌, 25వ సీడ్‌ టీన్‌, 19వ సీడ్‌ టామీ పాల్‌, అన్‌ సీడెడ్‌లు స్టాన్‌ వావ్రింకా, మారిన్‌ సిలిచ్‌, మహిళల్లో 19వ సీడ్‌ ముచోవా, 21వ సీడ్‌ మెర్టెన్స్‌, 23వ సీడ్‌ ష్నీడెర్‌, 25వ సీడ్‌ బడోసా కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి:

రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?

అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..

Updated Date - Jan 20 , 2026 | 05:34 AM