RoKo: రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:46 PM
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడంటే..
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ మూడు మ్యాచుల్లోనూ పెద్దగా రాణించలేదు. అయితే విరాట్ కోహ్లీ(Virat Kohli) మాత్రం రెండు సెంచరీలతో చెలరేగాడు. భారత్ ఓటమి బాధ ఓవైపు అయితే రో-కో మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతారో అనే బాధ అభిమానులను ఎక్కువగా వేధిస్తోంది. రో-కో మళ్లీ బరిలోకి ఎప్పుడు దిగనున్నారంటే.?
న్యూజిలాండ్ సిరీస్ ముగిసింది కాబట్టి రో-కో(RoKo)లకు దాదాపు ఆరు నెలల విరామం లభించనుంది. ఇప్పట్లో వన్డే సిరీస్ లేకపోవడంతో వీరికి రెస్ట్ దొరకనుంది. టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తుండటంతో భారత ఆటగాళ్లంతా దానిపై ఫోకస్ చేయనున్నారు. వరల్డ్ కప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో టీమిండియా 5 టీ20ల సిరీస్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ప్రారంభం కానుంది. రోహిత్, విరాట్‌ను ఇక ఐపీఎల్‌లోనే మళ్లీ చూడాలి.
బ్లూ జెర్సీలో..
అంతర్జాతీయ మ్యాచుల విషయానికొస్తే.. రో-కో మళ్లీ జూన్ లేదా జులైలో బరిలోకి దిగుతారు. అప్పుడు అఫ్గానిస్థాన్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ సిరీస్‌లో రో-కో ఆడే అవకాశాలున్నాయి. అయితే.. అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు యువ ప్లేయర్లకు అవకాశం ఇస్తే వీరిద్దరూ ఆడకపోవచ్చు. ఆ తర్వాత టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మాత్రం రో-కో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువ. బ్ల్యూ జెర్సీలో రో-కోను చూడటానికి అభిమానులు ఇంకా ఆర్నెళ్లు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
భారత్ ఓటమి.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: సునీల్ గావస్కర్