Womens Premier League 2026: ప్లేఆఫ్స్ లో ఆర్‌సీబీ
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:38 AM
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వేదిక మారినా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జోరు మాత్రం తగ్గలేదు. సోమవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షో...
డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ గీముంబై (రా. 7.30)
వరుసగా ఐదో విజయం
గౌతమి హాఫ్ సెంచరీ
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వేదిక మారినా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జోరు మాత్రం తగ్గలేదు. సోమవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షో కనబర్చిన ఆర్‌సీబీ 61 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే వరుసగా ఐదు విజయాలతో ప్లేఆ్‌ఫ్సలో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. అటు గుజరాత్‌కు హ్యాట్రిక్ ఓటమి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. గౌతమీ నాయక్ (55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 73) అర్ధసెంచరీ సాధించగా.. రిచా (27), మంధాన (26) ఫర్వాలేదనిపించారు. కష్వీ, ఆష్లేలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 117 పరుగులు చేసి ఓడింది. ఆష్లే గార్డ్‌నర్ (54) మాత్రమే ఆకట్టుకుంది. 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును తను ఆదుకునే ప్రయత్నం చేసినా.. మరో ఎండ్‌లో సహకారం కరువైంది. వరుస విరామాల్లో ఆర్‌సీబీ బౌలర్లు వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని గెలుపునకు దూరం చేశారు. సయాలీకి మూడు, డిక్లెర్క్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా గౌతమీ నాయక్ నిలిచింది.
గౌతమీ అండతో..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో గౌతమీ నాయక్ ఆట హైలైట్‌గా నిలిచింది. ఓపెనర్ హ్యారిస్ (1), జార్జియా వాల్ (1) తొలి రెండు ఓవర్లలోనే వెనుదిరిగినా.. కెప్టెన్ మంధానతో కలిసి మూడో వికెట్‌కు నాయక్ 60 పరుగులు జోడించింది. పదో ఓవర్‌లో మంధానను గార్డ్‌నర్ అవుట్ చేసినా.. రిచా అండతో గౌతమి మరింత ధాటిగా ఆడింది. ఈ జోరుతో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. అటు 16వ ఓవర్‌లో రిచా రెండు సిక్సర్లతో 17 రన్స్ అందించింది. వరుస ఓవర్లలో ఈ జోడీ వెనుదిరగ్గా.. ఆఖరి ఓవర్‌లో రాధా (17) రెండు ఫోర్లు, శ్రేయాంక (8 నాటౌట్) రెండు ఫోర్లతో జట్టు 17 రన్స్‌తో స్కోరు 170 దాటింది.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 178/6 (గౌతమి 73, రిచా 27, మంధాన 26; కష్వీ 2/38, గార్డ్‌నర్ 2/43).
గుజరాత్: 20 ఓవర్లలో 117/8 (గార్డ్‌నర్ 54, అనుష్క 18; సయాలీ 3/21, డి క్లెర్క్ 2/17).
ఇవి కూడా చదవండి:
రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?
అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..