చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:14 PM
టీ20 ప్రపంచ కప్ ముంగిట పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌న్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచులో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ ముంగిట పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో మొహ్మద్ నవాజ్ (5/18) విజృంభించడంతో పాక్.. కంగారూలను 111 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమైంది. నవాజ్ దెబ్బకు 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచులో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం(50*) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ సందర్భంగా ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా బాబర్ ఆజాం(Babar Azam) చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డును అధిగమించాడు. బాబర్ ఆజాం ఇప్పటి వరకు 39 అర్థ శతకాలు సాధించగా.. విరాట్ కోహ్లీ 38 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
అత్యధిక హాఫ్ సెంచరీలు.. జాబితా ఇదే
బాబర్ ఆజాం(పాకిస్థాన్)-132 ఇన్నింగ్స్, 39 హాఫ్ సెంచరీలు
విరాట్ కోహ్లీ(భారత్)- 117 ఇన్నింగ్స్, 38 హాఫ్ సెంచరీలు
రోహిత్ శర్మ(భారత్)- 151 ఇన్నింగ్స్, 32 హాఫ్ సెంచరీలు
మహ్మద్ రిజ్వాన్(పాకిస్థాన్)- 93 ఇన్నింగ్స్ 30 హాఫ్ సెంచరీలు
డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- 110 ఇన్నింగ్స్, 28 హాఫ్ సెంచరీలు
ఇవీ చదవండి:
డబ్ల్యూపీఎల్ 2026: ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్న యూపీ వారియర్స్
పాకిస్థాన్ ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడదు: సునీల్ గావస్కర్