విరాట్ దేశవాళీల్లో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:10 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. విరాట్ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ దేశవాళీల్లో ఆడాల్సిన అవసరం లేదని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ 240 పరుగులు చేశాడు. ఆఖరి వన్డేలో 108 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సులతో 124 పరుగులు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif).. విరాట్ ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘విరాట్ కోహ్లీ((Virat Kohli) ).. లండన్ నుంచి వస్తున్నాడు. పరుగులు సాధిస్తున్నాడు. మళ్లీ వెళుతున్నాడు. రెగ్యులర్‌గా ఆడకపోయినా.. ఇలా నిలకడగా పరుగులు రాబట్టడం అంత తేలికైన విషయం కాదు. అతడి ఫిట్‌నెస్, క్రికెట్‌పై అతడి అంకితభావం, స్వీయ సన్నద్ధత అమోఘం. విరాట్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు. అక్కడ కొత్తగా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మ్యాచ్ ప్రాక్టీస్ ఎవరైనా పొందుతారు. కానీ ఆటపై అతడికున్న అభిరుచిని ఇతరులు పొందడం సాధ్యం కాదు’ అని కైఫ్ వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో 123.2 యావరేజ్‌తో 616 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. అలాగే అతడు ప్రస్తుతం ఐసీసీ (ICC) వన్డే ర్యాంకింగ్స్‌లో నం.2 బ్యాటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
నేను సెల్ఫీల కోసం రాలేదు.. సాయం కోసం వచ్చా: రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ
లిజెలీ లీకి షాక్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు