లిజెలీ లీకి షాక్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:20 AM
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ లిజెలీ లీకి షాక్ తగిలింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో ఆమె కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు లీపై చర్యలు తీసుకున్నారు. ఆమె మ్యాచు ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించారు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ లిజెలీ లీ(Lizelle Lee)కి షాక్ తగిలింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో ఆమె కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు లీపై చర్యలు తీసుకున్నారు. ఆమె మ్యాచు ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్‌ను విధించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్(MI) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేశారు. ఢిల్లీకి 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనకు దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే ఆటను ముగించి విజయం సాధించారు. అయితే.. ఢిల్లీ(DC) బ్యాటింగ్ చేస్తుండగా.. 11వ ఓవర్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ లిజెలీ లీ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టంప్ ఔట్ అయింది. థర్డ్ అంపైర్ రివ్యూ అనంతరం ఆమె బ్యాట్ క్రీజ్ నుంచి క్షణకాలం పైకి లేవడం స్పష్టంగా కనిపించడంతో ఔట్‌గా నిర్ధారించారు. దీంతో సీజన్‌లో ఆమె మూడో అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలోనే పెవిలియన్‌కు వెనుదిరిగారు. అయితే.. అంపైర్ నిర్ణయంపై లిజెలీ లీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బౌండరీ క్యుషన్లను బ్యాట్‌తో కొడుతూ డగౌట్ చేరినట్లు కనిపించింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు.
అయితే.. మ్యాచ్ ఫలితంలో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయింది. కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ఫామ్‌లోకి వచ్చి 37 బంతుల్లో 51 పరుగులు చేయడంతో ఢిల్లీ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ప్రస్తుతం.. 4 జట్లు నాలుగేసి పాయింట్లతో సమంగా ఉండగా, మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. వివాదంలో రింకూ సింగ్!