The Ashes: వరుణుడి ఆటంకం.. తొలి రోజు ముగిసిన ఆట
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:22 PM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. జోరు మీదున్న ఇంగ్లండ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. చాలా సేపు వేచి చూసినా వరుణుడు కనికరించకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆసీస్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. జాక్ క్రాలీ(16), బెన్ డకెట్(27), జాకబ్ బెతెల్(10) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో 57/3తో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఈ దశలో జో రూట్(72*), హ్యారీ బ్రూక్(78*) అర్థ శతకాలతో జట్టును ఆదుకున్నారు.
ఈ క్రమంలో జోరు మీదున్న ఇంగ్లండ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 45 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో మ్యాచ్ సాగలేదు. చాలా సేపు వేచి చూసినా వరుణుడు కనికరించకపోవడంతో తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. బ్రూక్, రూట్ నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు గెలిచి ఆస్ట్రేలియా ఇప్పటికే సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో గెలిచి క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. ఈ ఐదో టెస్టులో కూడా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
ఇవి కూడా చదవండి:
అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?
138 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా!