David Warner: అరుదైన రికార్డు.. విరాట్ సరసన చేరిన వార్నర్!
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:59 PM
బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో సిడ్నీ థండర్ తరఫున హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ అద్భుత శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరసన ఓ అరుదైన జాబితాలోకి చేరాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ మరోసారి తన బ్యాటింగ్‌లో క్లాస్ చూపించాడు. బిగ్‌బాష్ లీగ్ 2025-26 సీజన్‌లో సిడ్నీ థండర్ తరఫున హోబార్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్(David Warner) అద్భుత శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరసన ఓ అరుదైన జాబితాలోకి చేరాడు.
జనవరి 3న సిడ్నీ షో గ్రౌండ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్‌కు వార్నర్ శుభారంభం అందించాడు. ఇన్నింగ్స్ ఓపెనర్‌గా వచ్చిన అతడు 65 బంతుల్లో 130 పరుగులు చేసి మెరిపించాడు. అతడి ఇన్నింగ్స్‌తో థండర్ జట్టు 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇది వార్నర్ కెరీర్‌లో 9వ టీ20 సెంచరీ. దీంతో టీ20ల్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, రీలీ రుసోతో సమానంగా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్, బాబర్ ఆజమ్‌లు మాత్రమే వార్నర్ కంటే ముందున్నారు.
కానీ ఓటమి..
వార్నర్ వీరోచిత ఇన్నింగ్స్ వృథా అయింది. హోబార్ట్ హరికేన్స్ బ్యాటర్లు సత్తా చాటడంతో థండర్‌కు పరాజయం తప్పలేదు. లక్ష్య ఛేదనలో టిమ్ వార్డ్ 90 పరుగులతో అదరగొట్టగా, మిచెల్ ఓవెన్ 18 బంతుల్లో 45 పరుగులు చేసి మ్యాచ్‌ను హోబార్ట్ వైపు తిప్పాడు. చివరకు హరికేన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడాడు. ‘రెండు ప్రారంభ వికెట్లు త్వరగా కోల్పోయాం. ఈ పిచ్‌పై ఓపికగా ఆడితే మంచి స్కోరు చేయొచ్చు. ప్రత్యర్థి బ్యాటర్లలో ఒకరు భారీ స్కోరు సాధిస్తారానుకున్నాం. కానీ ఇద్దరు ఆడారు. అదే మాకు కలిసి రాలేదు. ఇలాంటి పిచ్‌పై ఆత్మవిశ్వాసంతో నిలబడితే ఫలితం వస్తుంది’ అని అన్నాడు.
ఇవి కూడా చదవండి:
అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?
138 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా!