Health Tips: టీతో కలిపి ఇవి అస్సలు తినకండి.. లేదంటే..
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:20 PM
టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మందికి ఉదయం నిద్ర లేచిన తరువాత టీ, కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఇక టీ ప్రియులు అయితే రోజుకు 4 నుంచి 5సార్లు టీ తాగుతుంటారు. ఇంకొందరు ..
Side Effects of Tea: టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మందికి ఉదయం నిద్ర లేచిన తరువాత టీ, కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఇక టీ ప్రియులు అయితే రోజుకు 4 నుంచి 5సార్లు టీ తాగుతుంటారు. ఇంకొందరు టీ తో పాటు బిస్కెట్‌లు, రస్క్‌లు సహా రకరకాల స్నాక్స్ తింటుంటారు. మీరు కూడా టీ తో పాటు ఏదైనా స్నాక్స్ తింటున్నారా? ఆ అలవాటు మీకు కూడా ఉందా? అయితే, ఈ వార్త మీకోసమే. టీ తాగేటప్పుడు కాంబినేషన్‌గా కొన్ని పదార్థాలు తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మరి టీతో ఏయే ఆహారాలు తినొద్దో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ ఆహారాలను టీతో కలిపి తినొద్దు..
బిస్కెట్లు: చాలా మంది టీతో బిస్కెట్లు గానీ, రస్క్‌లు తింటారు. ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి చాలా హానీకరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో శుద్ధి చేసిన పిండి, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక చక్కెర ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. బరువు పెరగడం, గ్యాస్, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.
వేయించిన స్నాక్స్: సమోసాలు, పకోడీలు వంటి వేయించిన స్నాక్స్ టీతో కలిపి తినడం చాలా రుచికరంగా ఉంటుంది. కానీ, ఆరోగ్య పరంగా ఇది మంచిది కాదు. ఇది గుండె, జీర్ణవ్యవస్థ రెండింటికీ హానికరం. ఈ స్నాక్స్‌లోని అధిక నూనె.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
స్వీట్లు: కేకులు, పేస్ట్రీలు, ఇతర స్వీట్లను టీతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. వీటిని టీతో కలిపి తీసుకోవడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను దెబ్బతీస్తుంది. కడుపు ఉబ్బరంగా, అసిడిటీ సమస్యలకు కారణమవుతుంది. టీతో పాటు అధిక చక్కెర కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత క్రమంగా పెరుగుతుంది. ఇది ఊబకాయం, మధుమేహం, అలసటకు దారితీస్తుంది.
టీ తాగిన వెంటనే పండ్లు తినడం: చాలా మంది దీనిని ఆరోగ్యకరమైన చర్యగా భావిస్తారు. కానీ ఈ అలవాటు చాలా హానికరం. టీలోని టానిన్లు.. పండ్లలో ఉండే ఐరన్, పోషకాలను శరీరం గ్రహించకుండా నిరోధిస్తాయి. దీని కారణంగా శరీరానికి పూర్తి పోషకాహారం లభించదు. టీ తాగడానికి అరగంట ముందు లేదా తర్వాత పండ్లు తినడం ఉత్తమం.
చాక్లెట్: చాక్లెట్, టీ రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. వాటిని కలిపి తీసుకోవడం వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది. విశ్రాంతి లేకపోవడం, నిద్రలేమి సమస్యలు వస్తాయి.
టీతో మందులు తీసుకోవడం: కొంతమంది టీతో మందులు వేసుకుంటారు. ఇది చాలా తప్పు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీలోని కెఫిన్, టానిన్లు మందుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. కొన్ని సందర్భాల్లో దుష్ప్రభావాలకు కారణమవుతాయి. అందుకే మందులను ఎప్పుడైనా నీటితోనే తీసుకోవాలి.
Also Read:
Black Magic: ప్రియుడిని దక్కించుకునేందుకు బ్లాక్ మ్యాజిక్.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
Asia Cup 2025: ఇంకా భారత్‌కు అందని ఆసియా కప్.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..