Share News

Asia Cup 2025: ఇంకా భారత్‌కు అందని ఆసియా కప్.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Jan 04 , 2026 | 03:40 PM

ఆసియా కప్ 2025ఫైనల్ లో పాకిస్థాన్ ను ఓడించి భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విజయం సాధించి దాదాపు నాలుగు నెలలు గడిచినా టీమిండియాకు మాత్రం విన్నింగ్ ట్రోఫీ అందలేదు. తాజాగా ట్రోఫీపై ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Asia Cup 2025: ఇంకా భారత్‌కు అందని ఆసియా కప్.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Asia Cup 2025

ఇంటర్నెట్ డెస్క్: 2025 సెప్టెంబర్ 28న ఆసియా కప్(Asia Cup 2025) ఫైనల్ లో పాకిస్థాన్ ను ఓడించి భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విజయం సాధించి దాదాపు నాలుగు నెలలు గడిచినా టీమిండియాకు మాత్రం విన్నింగ్ ట్రోఫీ అందలేదు. సాధారణంగా టోర్నమెంట్ గెలిచిన వెంటనే విజేత జట్టుకు ట్రోఫీని అందజేస్తారు. కానీ పీసీబీ ఆధ్యక్షుడు, ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇప్పటివరకు ఆ ట్రోఫీని భారత్‌కు ఇవ్వలేదు. అయితే తాజాగా ఆసియా కప్ 2025 ట్రోఫీపై నఖ్వీ(Mohsin Nakhvi) కీలక కామెంట్స్ చేశారు.


ఇటీవల కరాచీలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో నఖ్వీని ఈ ట్రోఫీ గురించి మీడియా అడిగింది. ఆయన సమాధానం ఇస్తూ.. ట్రోఫీ ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉందని బదులిచ్చాడు. దీనిని బట్టి భారత్‌కు ఇంకా ట్రోఫీ ఇవ్వలేదని పరోక్షంగా చెప్పారని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. అయితే పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఈ ట్రోఫీని దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ కాంప్లెక్స్‌లో ఉన్న ఏసీసీ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉందని సమాచారం. కేవలం అనుమతి ఉన్న అధికారులు మాత్రమే అక్కడికి వెళ్లగలరు.


ఈ వివాదం ముగిసే వరకు ఆ ట్రోఫీని భద్రత సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. మరోవైపు బీసీసీఐ, నఖ్వీ(Mohsin Nakhvi) మధ్య ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. నఖ్వీ స్వయంగా తన చేతులతోనే టీమిండియాకు ట్రోఫీ ఇవ్వాలని పట్టుబడుతుండగా, అతని చేతుల మీదుగా తీసుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు. ఐసీసీ కూడా ఈ వివాదాన్ని(Trophy Dispute) పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. మరి భారత్‌కు దక్కాల్సిన ట్రోఫీ ఎప్పుడు అందుతుందా అని అందరీలో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా

James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్

Updated Date - Jan 04 , 2026 | 03:40 PM