TG Politics: కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు ఉరితీయాలో తెలియదు: కేటీఆర్
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:26 PM
కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు ఉరితీయాలో తెలియదన్నారు.
హైదరాబాద్, జనవరి 4: కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు ఉరితీయాలో తెలియదన్నారు. ఉరిశిక్షల గురించి మాట్లాడుతున్న రేవంత్‌ను, రాహుల్ గాంధీని ముందుగా ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అశోక్ నగర్ అడ్డా మీద 2లక్షల ఉద్యోగాలిస్తామని మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరితీయాలని వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరితీయాలన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరితీయాలన్నారు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి అధినేత రేవంత్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఒక్క భాషే వచ్చని.. తమకు మూడు నాలుగు భాషల్లో తిట్టుడు వచ్చంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.
సీఎం రేవంత్ రెడ్డికి IIT, IIIT కి మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు తేడా తెలియదని విమర్శించారాయన. రేవంత్ రెడ్డి ఒక అజ్ఞాని అని.. ఆయనను ఉష్ట్రపక్షి అని అభివర్ణించారు. నదీ జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. 65 ఏళ్ల కాంగ్రెస్, 17ఏళ్ల రేవంత్ పాత బాస్ చంద్రబాబు నాయకత్వంలో రేవంత్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. తెలంగాణకు జరిగిన ద్రోహానికి కాంగ్రెస్ ప్రధాన కారణంగా పేర్కొన్నారు కేటీఆర్.
Also Read:
Priyanka Gandhi: అస్సామ్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ప్రియాంక గాంధీ
JBL Speaker Viral Video: ఇలాక్కూడా జరుగుతుందా! ఇదేంటో తెలిస్తే.. వైరల్ వీడియో
James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్