Share News

Black Magic: ప్రియుడిని దక్కించుకునేందుకు బ్లాక్ మ్యాజిక్.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:06 PM

అతను, ఆమె కొంతకాలం ప్రేమించుకున్నారు.. ఏమైందో ఏమో.. ఇద్దరూ విడిపోయారు. కానీ, అతని ఎడబాటును ఆమె తట్టుకోలేకపోయింది. అతన్ని ఎలాగైనా తనవైపు తిప్పుకోవాలని భావించింది. అతనితో జీవితం పంచుకోవాలని...

Black Magic: ప్రియుడిని దక్కించుకునేందుకు బ్లాక్ మ్యాజిక్.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
Black Magic

బెంగళూరు, జనవరి 04: అతను, ఆమె కొంతకాలం ప్రేమించుకున్నారు.. ఏమైందో ఏమో.. ఇద్దరూ విడిపోయారు. కానీ, అతని ఎడబాటును ఆమె తట్టుకోలేకపోయింది. అతన్ని ఎలాగైనా తనవైపు తిప్పుకోవాలని భావించింది. అతనితో జీవితం పంచుకోవాలని అనుకుంది. కానీ, అతను వచ్చేలా లేడు.. ఏం చేయాలా? అని ఆలోచించింది ఆ యువతి. ఈ క్రమంలో.. ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ ప్రకటన కనపించింది. ఆ ప్రకటన ఆ అమ్మాయి లైఫ్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మరి ఇంతకీ ఏం ప్రకటన చూసింది.. ఆమే ఏం చేసింది.. ఆ ట్విస్ట్ ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


బెంగళూరుకు చెందిన ఓ యువతికి తన ప్రియుడు బ్రేకప్ చెప్పాడు. అతని ఎడబాటును తట్టుకోలేకపోయిన ఆమె.. ఎలాగైనా అతన్ని తిరిగి పొందాలనుకుంది. ఈ క్రమంలోనే.. ఇన్‌స్టాగ్రమ్‌లో జ్యోతిష్యం చెబుతామని.. ప్రేమికులను కలుపుతామంటూ ఓ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను చూసిన యువతి.. అందులో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్‌కు కాల్ చేసింది. తన ప్రియుడిని తన వద్దకు చేర్చాలంటూ సదరు స్వామీజీ చంద్రశేఖర్ సుగత్ గురూజీని అడిగింది. దీంతో దొరికిందే అవకాశం అని భావించిన అతను.. తాను బ్లాక్ మ్యాజిక్ చేసి తన ప్రియుడిని తన వద్దకు చేరుస్తానంటూ నమ్మబలికాడు. ఇది నమ్మిన ఆ అమ్మాయి.. అతను చెప్పిందల్లా చేసింది. రూ. 2 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పగా.. ఆ డబ్బు అంతా ఇచ్చేసింది. త్వరలోనే మీఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ ఊదరగొట్టాడు.


కొంతకాలం తరువాత మళ్లీ రూ. 4 లక్షలు అడిగాడు. అప్పుడే ఆ అమ్మాయికి సందేహం వచ్చింది. ఇప్పటికే రూ. 2 లక్షలు ఇచ్చానని.. ఎలాంటి ఫలితం లేదని యువతి ప్రశ్నించింది. తన డబ్బులు తనకు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక అసలు రూపం బయటపెట్టాడు దొంగ స్వామీజీ. డబ్బులు అడిగితే బ్లాక్ మ్యాజిక్ చేసి నష్టం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో చేసేదేమీ లేక.. యువతి నేరుగా పోలీసులను ఆశ్రయించింది. ఆడుగోడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

Asia Cup 2025: ఇంకా భారత్‌కు అందని ఆసియా కప్.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

BMC Elections: ఎప్పటికీ మాదే అధికారం అనుకోవద్దు.. బీఎంసీ మేనిఫెస్టే విడుదల చేసిన ఠాక్రే బ్రదర్స్

TG Politics: కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు ఉరితీయాలో తెలవదు: కేటీఆర్

Updated Date - Jan 04 , 2026 | 04:06 PM