BMC Elections: ఎప్పటికీ మాదే అధికారం అనుకోవద్దు.. బీఎంసీ మేనిఫెస్టో విడుదల చేసిన ఠాక్రే బ్రదర్స్
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:36 PM
అసెంబ్లీ చైర్మన్‌గా ఉన్న రాహుల్ నార్వేకర్ బహిరంగంగానే అభ్యర్థులను, ఓటర్లను బెదిరించడం దిగ్భ్రాంతికి కలిగించినట్టు ఉద్ధమ్ థాకరే తెలిపారు. స్వీకర్‌పై వెంటనే చర్చలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ముంబై: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామని బీజేపీ అనుకుంటే పొరపాటని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) అన్నారు. మహారాష్ట్రను యూపీ, బిహార్‌లా మార్చాలనుకుంటున్నారని విమర్శించారు. మహారాష్ట్ర ఈ దేశానికి దిశానిర్దేశం చేస్తుందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్రలో పోటీ లేకుండా అభ్యర్థులను గెలిపించుకోవడంపై ఏం చెబుతుందని ప్రశ్నించారు. బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMS) ఎన్నికల మేనిఫెస్టోను తన సోదరుడు, శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి ఆదివారంనాడిక్కడ ఆయన విడుదల చేశారు. బీజేపీ, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌పై ఈ సందర్భంగా ఠాక్రే సోదరులు విమర్శలు గుప్పించారు.
అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న రాహుల్ నార్వేకర్ బహిరంగంగానే అభ్యర్థులను, ఓటర్లను బెదిరించడం దిగ్భ్రాంతికి కలిగించినట్టు ఉద్ధమ్ థాకరే తెలిపారు. స్పీకర్‌పై వెంటనే చర్చలు తీసుకోవాలని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నేతల సెక్యూరిటీ తీసేయాలని అధికారులకు ఆయన తెలిపారని, ఆయనకు అసెంబ్లీలో అధికారం ఉందే కానీ, బయట లేదని చెప్పారు. అభ్యర్థులను పోటీలేకుండా ఎన్నుకోవడం ద్వారా ఓటర్ల హక్కులను నార్వేకర్ కొల్లగొట్టారని, ఆయనపై కేసు నమోదు చేయాలని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రాంతాల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మోదీతో రాజీలేదు..
ప్రధాని నరేంద్ర మోదీపై ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. ''ఇది ముఠా పాలనే కానీ, ప్రజాస్వామ్యం కాదు. ఓట్ చోరీకి పాల్పడుతుంటే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఇప్పుడు అభ్యర్థులను తస్కరిస్తున్నారు. మేము మాత్రం మోదీతో రాజీపడే ప్రసక్తే లేదు. రిటర్నింగ్ అధికారుల కాల్ రికార్డులన్నీ మాకు చూపించాలని ఎన్నికల కమిషన్‌ను మేము సవాలు చేస్తున్నాం' అని ఠాక్రే అన్నారు.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలాపై అమెరికా దాడులు... భారత్ రియాక్షన్
నికోలస్ మదురో సత్యసాయి భక్తుడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి