Actor Vijay TVK: కాంగ్రెస్ మా సహజ మిత్రుడు.. విజయ్ టీవీకే సంకేతాలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 09:50 PM
ఈ ఏడాది జరుగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశాలున్నాయని నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం సంకేతాలు ఇచ్చింది..
చెన్నై: ఈ ఏడాది జరుగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (Tamilnadu Assembly Elections) కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశాలున్నాయని నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) సంకేతాలు ఇచ్చింది. టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ, లౌకికవాదం, మతత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటం విషయంలో కాంగ్రెస్-టీవీకే విధానాలు ఒకేలా ఉంటాయని, ఆ పరంగా రెండు పార్టీలు సహజ భాగస్వాములని చెప్పారు. రాహుల్ గాంధీ, తమ నేత విజయ్ మంచి స్నేహితులని తెలిపారు.
ఇరు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలున్నప్పటికీ ఒక అవగాహనకు వచ్చేముందు కొన్ని అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని ఫెలిక్స్ అన్నారు. ప్రస్తుత ప్రతిష్టంభనకు తమిళనాడు కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. ఆ పార్టీ విభాగం నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీవీకేతో చర్చలకు వెనుకంజ వేస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. టీవీకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మైనారిటీ, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కాపోడుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
కాగా, టీవీకే-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చనే సంకేతాలు గత నెలలోనే కనిపించినట్టు చెబుతున్నారు. డిసెంబర్ 25న జరిగిన టీవీకే కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం ఈ వాదనకు బలం చేకూర్చింది. తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా 2024 అక్టోబర్‌లో టీవీకేను విజయ్ ప్రారంభించారు. అయితే టీవీకే ఎంట్రీతో తమకొచ్చే ముప్పు ఏదీ లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
బీజేపీని చూసి ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోలేరు: మోహన్ భగవత్
పోలింగ్‌కు ముందే 68 సీట్లలో మహాయుతి గెలుపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి