India: వెనెజువెలాపై అమెరికా దాడులు... భారత్ రియాక్షన్
ABN , Publish Date - Jan 04 , 2026 | 02:48 PM
అమెరికా బలగాలు వెనెజువెలాపై శనివారంనాడు దాడులతో విరుచుకుపడింది. ఆ దేశం అధ్యక్షుడు నికోలాస్ మదురో, ఆయన భార్యను యూఎస్ డెల్టా ఫోర్స్ అదుపులోనికి తీసుకుని న్యూయార్క్ తరలించింది. అక్కడి కోర్టులో వీరు విచారణను ఎదుర్కోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: వెనెజువెలాపై అమెరికా దాడుల విషయంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరువర్గాలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ (MEA) ఒక ప్రకటన విడుదల చేసింది. వెనెజువెలాలోని భారతీయులతో కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని తెలిపింది.
'వెనెజువెలాలో చోటుచేసుకున్న పరిమాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. వెనెజువెలా ప్రజల క్షేమం, భద్రతకు అవసరమైన సపోర్ట్ అందించేందుకు భారత్ కట్టుబడి ఉంది. వెనెజువెలాలో శాంతి, స్థిరత్వం కోసం ఉభయవర్గాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి' అని ఎంఈఓ ఆ ప్రకటనలో కోరింది.
అమెరికా బలగాలు వెనెజువెలాపై శనివారం నాడు దాడులతో విరుచుకుపడ్డాయి. ఆ దేశ అధ్యక్షుడు నికోలాస్ మదురో, ఆయన భార్యను యూఎస్ డెల్టా ఫోర్స్ అదుపులోనికి తీసుకుని న్యూయార్క్ తరలించింది. అక్కడి కోర్టులో వీరు విచారణను ఎదుర్కోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మదురో తమ కస్టడీలో ఉన్న ఫోటోలను ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది. నార్కో-టెర్రరిజం, మాదక ద్రవ్యాల అక్రమరవాణాలో మదురో పాత్ర ఉందని అమెరికా ప్రధాన ఆరోపణగా ఉంది. వెనెజువెలాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ ప్రభుత్వాన్ని అమెరికా నడుపుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
తాత్కాలిక అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్
మరోవైపు, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్లీ రోడ్రిగ్స్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు నియమించింది. దేశ రక్షణ, ప్రభుత్వ పరిపాలన కొనసాగింపును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. రోడ్రిగ్స్ 2018లో వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆర్థిక, చమురు మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. మదురోకు విశ్వసనీయురాలిగా రోడ్రిగ్స్‌కు పేరుంది.
ఇవి కూడా చదవండి..
నికోలస్ మదురో సత్యసాయి భక్తుడు
కాంగ్రెస్ మా సహజ మిత్రుడు.. విజయ్ టీవీకే సంకేతాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి