Share News

Nicolás Maduro Devotee of Sathya Sai Baba: నికోలస్‌ మదురో సత్యసాయి భక్తుడు

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:32 AM

వెనెజువెలా అధ్యక్షుడు మదురో సత్యసాయిబాబాకు భక్తుడు. 2005లో మదురో విదేశాంగ మంత్రిగా ఉన్నపుడు ఆయన భార్య సిలియా ఫ్లోరె్‌సతో కలసి పుట్టపర్తికి వచ్చి సత్యసాయిబాబా నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

Nicolás Maduro Devotee of Sathya Sai Baba: నికోలస్‌ మదురో సత్యసాయి భక్తుడు

  • 2005లో పుట్టపర్తికి వచ్చి బాబా ఆశీర్వచనాలు

పుట్టపర్తి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): వెనెజువెలా అధ్యక్షుడు మదురో సత్యసాయిబాబాకు భక్తుడు. 2005లో మదురో విదేశాంగ మంత్రిగా ఉన్నపుడు ఆయన భార్య సిలియా ఫ్లోరె్‌సతో కలసి పుట్టపర్తికి వచ్చి సత్యసాయిబాబా నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అప్పట్లో సత్యసాయిని ప్రత్యేకంగా కలిశారు. సైమన్‌ బొలివర్‌, హ్యూగో చావెజ్‌ ఫొటోలతో పాటు సత్యసాయి నిలువెత్తు ఫొటోను కూడా తన అధ్యక్ష ప్యాలె్‌సలో ఉంచారు. మదురో కంటే ముందు ఆయన భార్య సాయుకి భక్తురాలిగా ఉండేవారు. ఆమె ప్రభావంతో ఆయన కూడా బాబా భక్తుడిగా మారారు. 2011లో సత్యసాయి శివైక్యం అయినపుడు వెనుజువెలా జాతీయ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టడంలో మదురో కీలక పాత్ర పోషించారు. మరే దక్షిణ అమెరికా దేశం ప్రకటించనట్లుగా ఒకరోజు సంతాపదినం కూడా అప్పట్లో ప్రకటించి ఆధ్యాత్మిక గురువు పట్ల తన భక్తి చాటుకున్నారు. సత్యసాయి మహాసమాధిని కూడా దర్శించారు. 2025 నవంబరు 23న సాయిబాబా శతజయంతోత్సవం సందర్భంగా.. బాబాను ఉద్దేశించి ‘కాంతి స్వరూపుడు’ అన్నారు. ఇతర విదేశీ ఎన్‌జీవోలను దేశం నుంచి పంపివేసినా, మదురో అండతో సత్యసాయి సంస్థ మాత్రం వెనుజువెలాలో సేవలు అందిస్తూనే ఉంది.

Updated Date - Jan 04 , 2026 | 04:32 AM