Share News

JNTU: జేఎన్‌టీయూలో ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సులు

ABN , Publish Date - Jan 07 , 2026 | 09:45 AM

నగరంలోని కూకట్‏పల్లిలోగల జేఎన్‌టీయూలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విత్‌ పైథాన్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నిక్స్‌కు సంబంధించి రెండు సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఇన్నోవేషన్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌ విభాగం(డిల్ట్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుషమా తెలిపారు.

JNTU: జేఎన్‌టీయూలో ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సులు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విత్‌ పైథాన్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నిక్స్‌కు సంబంధించి రెండు సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఇన్నోవేషన్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌ విభాగం(డిల్ట్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుషమా(Sushama) తెలిపారు. అధునాతన సాంకేతికతల్లో విద్యార్థులు, ఉద్యోగుల నైపుణ్యం పెంపు కోసం 6 నెలల సర్టిఫికెట్‌ కోర్సులకు నోటిఫికేషన్‌ జారీ చేశామని ఆమె పేర్కొన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ డిల్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు జాతీయ విద్యావిధానం-2020 ప్రకారం క్రెడిట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు.


city6.jfif

అన్ని సెషన్లు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ, అఫిలియేటెడ్‌ కాలేజీల విద్యార్థులు థియరీ సబ్జెక్టుల క్రెడిట్లను, బీటెక్‌ డిగ్రీలోకి ఇట్టే బదిలీ చేసుకోవచ్చన్నారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి, చదువుతున్న విద్యార్థులకు ఫీజులో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.


city6.3.jpg

రిజిస్ట్రేషన్‌కు నెలాఖరు వరకు గడువు

ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులు అభ్యసించాలనుకునే అభ్యర్థులు జేఎన్‌టీయూ అడ్మిషన్‌ విభాగం వెబ్‌సైట్‌లో తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని డిల్డ్‌ డైరెక్టర్‌ సుషమా తెలిపారు. ఎస్‌ఎ్‌ససీ, ఇంటర్‌/డిప్లమా, డిగ్రీ/ బీటెక్‌ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆరు నెలల సర్టిఫికెట్‌ కోర్సుకు రూ.25 వేల ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 9154251963లో సంప్రదించాలని ఆమె సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఎల్‌ఐసీ నుంచి జీవన్‌ ఉత్సవ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 07 , 2026 | 09:45 AM