Share News

జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఆన్సర్ కీ విడుదల

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:49 PM

జేఈఈ మెయిన్స్ - 2026 సెషన్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. జనవరి మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఆన్సర్ కీ విడుదల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 04: జేఈఈ మెయిన్స్-2026 సెషన్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లోకి వెళ్లి ఈ ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.


డైరెక్ట్‌గా జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ ద్వారా ..

ఈ విండో నేటి నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంటుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరించింది. ఫిబ్రవరి 6వ తేదీన ఈ విండో క్లోజ్ అవుతుందని అభ్యర్థులకు స్పష్టం చేసింది. అనంతరం ఈ విండో 2 నుంచి 3 రోజులు తెరిచి ఉంటుందని వివరించింది. ఈ సమయంలో అభ్యర్థులు తాత్కాలిక సమాధాన కీని సవాల్ చేసుకోవచ్చని.. అందుకు ప్రతి ప్రశ్నకు రూ.200 చెల్లించాలని అది కూడా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సబ్జెక్ట్ నిపుణులు అన్ని ప్రశ్నలను పరిశీలించి.. తుది సమాధానానికి సంబంధించిన కీని ప్రకటిస్తారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది.


జనవరి మూడో వారంలో..

జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షను నిర్వహించారు.

జేఈఈ మెయిన్ 2026 ఆన్సర్ కీ డౌన్‌లోడ్ ఇలా చేసుకొండి..

1. jeemain.nta.nic.in. వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

2. మెయిన్ 2026 అన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.

3. అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్/ డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో లాగిన్ కావాలి.

4 . ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి

5. ప్రింట్ అవుట్ తీసుకోండి.


మరోవైపు జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల తేదీకి సంబంధించిన షెడ్యూల్‌ను సైతం ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్ విడుదల చేసింది. మరిన్ని వివరాలతోపాటు తాజా అప్ డేట్స్ కోసం బ్లాగును పరిశీలించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జేఈఈ మెయిన్స్ తుది పరీక్షల షెడ్యూల్ విడుదల

లోక్‌సభ సాయంత్రం 5 గంటలకు వాయిదా..

For More Education News And Telugu News

Updated Date - Feb 04 , 2026 | 05:07 PM