Telangana: అసెంబ్లీపై కేటీఆర్ హాట్ కామెంట్స్..
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:21 PM
తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా మారిందని మండిపడ్డారు.
జనగామ, జనవరి 6: తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా మారిందని మండిపడ్డారు. మంగళవారం నాడు జనగామలో పర్యటించిన కేటీఆర్.. పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. 'కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయని.. అలుగుడు గులుగుడు ఉంటది, సర్దుకుపోవాలన్నారు. లేదంటే.. కాంగ్రెస్ వాళ్లకు సందు దొరుకుతది' అని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఇచ్చిన హామీలన్నింటినీ మర్చిపోయారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌ను ఉరి తీయాలని రేవంత్ రెడ్డి అన్న కామెంట్స్‌ని ప్రస్తావించిన కేటీఆర్.. చావునోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్‌ను ఉరి తీయాలా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రైతుల అవస్థలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. యాప్‌లో యూరియా దొరకక రైతులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని.. రీడర్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వరంగల్‌లో రైతులకు ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మరిచిన రాహుల్ గాంధీని ఉరితీయాలని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read:
ఈ తేనె బంగారం కన్నా విలువైనది.. ఎందుకంటే?
కోనసీమ గ్యాస్ లీకేజ్‌పై సీఎం ఆదేశాలివే..
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు