New Delhi: సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్..
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:11 PM
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. సోనియ గాంధీ శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని..
న్యూఢిల్లీ, జనవరి 6: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. సోనియ గాంధీ శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోనియా గాంధీ కూడా చాలా కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.
ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిన ప్రతి సారి ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కూడా ఢిల్లీలో చలి తీవ్రత పెరగడం, పొల్యూషన్ కూడా భారీగా పెరగడంతో సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం సాయంత్రం ఆమె ఆస్పత్రిలో చేరారు. రొటీన్ చెకప్‌లో భాగంగానే సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారు. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువగా ఉన్న సమయంలో సోనియాగాంధీ రెగ్యులర్ చెకప్‌ల కోసం క్రమం తప్పకుండా ఆస్పత్రికి వస్తారని అధికారులు తెలిపారు.
అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ..
సోనియా గాంధీకి ప్రస్తుతం 79 ఏళ్లు నిండాయి. వయోభారంతో పాటు.. ఆమె పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఉదర సంబంధిత సమస్యతో ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆ తరువాత జూన్‌లోనూ ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ తరువాత కూడా సోనియా గాంధీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు నేషనల్ మీడియా చెబుతోంది.
Also Read:
ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలి.. సీఎం రేవంత్‌కి కిషన్‌రెడ్డి లేఖ
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పెంపునకు చర్యలు: పొన్నం
విషాదం.. నీటితొట్టిలో పడి మూడేళ్ల చిన్నారి మృతి