Share News

MLA: భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచండి

ABN , Publish Date - Jan 12 , 2026 | 11:32 PM

రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో ఉన్న భూ సమస్యలకు వేగంగా పరిష్కా రం చూపించాలని ఆర్డీఓ మహేశకు ఎమ్మెల్యే పరిటాలసునీత విజ్ఞప్తిచే శారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఽసోమవారం స్థాని క ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన రెవిన్యూ క్లినిక్‌ కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత వచ్చారు.

MLA: భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచండి
MLA Paritala Sunitha talking to RDO Mahesh

ఆర్డీఓతో ఎమ్మెల్యే పరిటాల సునీత

ధర్మవరం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో ఉన్న భూ సమస్యలకు వేగంగా పరిష్కా రం చూపించాలని ఆర్డీఓ మహేశకు ఎమ్మెల్యే పరిటాలసునీత విజ్ఞప్తిచే శారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఽసోమవారం స్థాని క ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన రెవిన్యూ క్లినిక్‌ కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత వచ్చారు. ఆర్డీఓ మహేశను కలిసి ప్రస్తుతం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నేపఽథ్యంలో రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను వివరించారు. వాటి పరిష్కారంపై తహసీల్దార్‌లు, వీఆర్‌ఓ లు ఇతర సిబ్బంది వేగంగా పనిచేసేలా చూడాలని కోరారు.


అనం తరం ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ... భూ సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అసై న్మెంట్‌ కమిటీ ఏర్పాటుచేయాలని ఇప్పటికే రెవెన్యూశాఖ మంత్రికి విజ్ఞప్తిచేశామన్నారు. గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో భూముల రికార్డులను అస్తవ్యస్తం చేశారని ఆమె పేర్కొన్నారు. పైగా తన సొమ్ము ఏదో ఇచ్చినట్టు పాసుపుస్తకాల్లో జగనరెడ్డి తన ఫొటో వేసుకున్నారని విమర్శించారు. దీనిపై అప్పట్లో ఐఏఎస్‌లు ఎందుకు అభ్యంతరం చెప్ప లేదో అర్థం కావడంలేదన్నారు. గతంలో జరిగిన తప్పుల్ని సరిచే స్తున్నా మని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆమె వెంట ఏపీసీడ్స్‌ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య, నాయకులు పరిశే సుధాకర్‌, ఫణికుమార్‌, పురుషోత్తంగౌడ్‌, దండు ఓబుళేశు, మాధవరెడ్డి, రేనాటి శీన, కేశగాళ్ల శీన, లోకేశ, టీడీపీ పార్లమెంట్‌ అధికార ప్రతినిధి ముతుకూరు బీబీ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 12 , 2026 | 11:32 PM