Fire వ్యవసాయ పొలంలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:17 AM
మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో రైతు బాసి నారాయణకు చెందిన వ్యవసాయపొలంలో శనివారం మధ్యాహ్నం విద్యుతషార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది.
రామగిరి, డిసెంబరు 13(ఆంఽధ్రజ్యోతి): మండలంలోని ఏడుగుర్రాలపల్లిలో రైతు బాసి నారాయణకు చెందిన వ్యవసాయపొలంలో శనివారం మధ్యాహ్నం విద్యుతషార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది.
దీంతో మంటలు వ్యాపించి మొక్కజొన్నతో పాటు అందుకు ఏర్పాటుచేసిన డ్రిప్ వైర్లు, స్టార్టర్ పెట్టె, బంజరు కేబుళ్లు కాలిపోయాయి. ఇతడి సోదరుడైన గోపన్న పొలానికి కూడా మంటలు సోకడంతో అక్కడి మొక్కజొన్న చొప్పతో పాటు ల్యాడర్ కాలిపోయింది. మంటలను గమనించిన అక్కడికి వెళ్లి చూసే లోపే మొత్తం కాలిపోయాయని, ఆర్పేందుకు కూడా వీలు కాలేదని బాధిత రైతులు వాపోయారు. రూ.2లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు చెపారు. వారిని ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్థులు కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..