Share News

Ananthapuram News: చలిలో.. వ్యవసాయ పనుల్లో.. ఎమ్మెల్యే పరిటాల సునీత

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:51 AM

నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై బిజీబిజీగా ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత ఒక్కరోజు తన పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వెంకటాపురం వద్దగల తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం చలిలోనే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అప్పుడే పనుల్లోకి వస్తున్న కూలీలతో మమేకమయ్యారు.

Ananthapuram News: చలిలో.. వ్యవసాయ పనుల్లో.. ఎమ్మెల్యే పరిటాల సునీత

- ఎమ్మెల్యే పొలం పనులు

రామగిరి(అనంతపురం): రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Raptadu MLA Paritala Sunitha) మంగళవారం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని వెంకటాపురం(Venkatapuram) వద్దగల తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం చలిలోనే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అప్పుడే పనుల్లోకి వస్తున్న కూలీలతో మమేకమయ్యారు. అక్కడ సాగు చేసిన వివిధ పంటలను పరిశీలించారు.


pandu2.2.jpg

మిరప కాయలను కోశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయంలో ఉన్న ఆత్మ సంతృప్తి మరెక్కడా లేదన్నారు. రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు. అన్నదాతలకు ఎమ్మెల్యే రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


pandu2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

నిరాశ వదిలించి...నవజీవనం వైపు

Read Latest Telangana News and National News

pandu2.jpg

Updated Date - Dec 24 , 2025 | 11:52 AM