fake Gold Loan Scam: నకిలీ బంగారంతో మోసం.. బ్యాంకు సిబ్బంది అలర్ట్.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:21 PM
నకిలీ బంగారంతో మోసం చేయాలని చూసిన ముఠాను బ్యాంక్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించింది. సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా, డిసెంబర్ 10: అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఇంట్లోని బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకుంటాము. బ్యాంకులు కూడా మన దగ్గర ఉన్న బంగారానికి ఎంత వస్తుందో చూసి అంత మేరకు నగదును ఇస్తుంటారు. ఇదే కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించి బొక్కబోర్లాపడ్డారు. నకిలీ బంగారంతో బ్యాంకులనే మోసం చేయాలని చూశారు. అయితే బ్యాంకు సిబ్బంది అప్రమత్తతతో నకిలీ బంగారం ముఠా గట్టు రట్టైంది. బ్యాంకులనే బురిడీ కొట్టించేందుకు యత్నించిన ముఠా.. చివరకు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.
ఇదీ జరిగింది..
జిల్లాలోని ఓబులదేవరచెరువు, గోరంట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకునే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది నకిలీ బంగారం ముఠా. సదరు ముఠా సభ్యులు ఇదే బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి ఓ సారి లోన్లు తీసుకున్నారు. అయితే మరోసారి అదే బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకోవడానికి రావడంతో వెంటనే బ్యాంకు సిబ్బంది అప్రమత్తమయ్యారు. నకిలీ బంగారం ముఠా సభ్యులు వచ్చిన వెంటనే గేట్లకు తాళం వేసిన బ్యాంకు సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నకిలీ బంగారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ బంగారం ముఠా గుట్టు రట్టవడంతో శ్రీ సత్యసాయి జిల్లాలోని బ్యాంకర్లను పోలీసులు అప్రమత్తం చేశారు. బంగారం పెట్టి లోన్లు తీసుకోనే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం: పవన్
తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News