AP High Court: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:10 PM
తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది.
అమరావతి, డిసెంబర్ 10: తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. చోరీ కేసులో ఎన్వీఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొనేందుకు సీఐడీ, ఏసీబీ డీజీలకు హైకోర్టు వెసులుబాటు కల్పించింది. చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు సూచించింది.
టీటీడీ అప్పటి ఏవీఎన్వో వై. సతీష్ కుమార్ పోస్టుమార్టం సర్టిఫికేట్‌ను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు అందజేయాలని సీఐడీని ఆదేశించింది. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారాన్ని అవసరమైన మేరకు ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో పంచుకోవాలని స్పష్టీకరించింది. సీఐడీ, ఏసీబీ డీజీలు దాఖలు చేసిన నివేదికలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం ఈనెల 16కు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
18 నెలల తర్వాత.. గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం
గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం: పవన్
Read Latest AP News And Telugu News