Share News

Kodali Nani: 18 నెలల తర్వాత.. గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:59 PM

ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో దాదాపు 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని నేడు గుడివాడలో ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరే్ంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు.

Kodali Nani: 18 నెలల తర్వాత.. గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం
Kodali Nani

కృష్ణా జిల్లా, డిసెంబర్ 10: సుదీర్ఘ విరామం తర్వాత క్రియాశిల గుడివాడ రాజకీయాల్లో మాజీ మంత్రి కొడాలి నాని (Former Minister Kodali Nani) ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో తొలిసారి పాల్గొన్నారు కొడాలి. ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో దాదాపు 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు మాజీ మంత్రి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. గవర్నర్‌కు అందించే వినతిపత్రంలో సంతకం చేశారు. ఆపై వినతి పత్రాలను జిల్లా కమిటీకి అందించే పార్టీ శ్రేణుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ శ్రేణులతో కొడాలి నాని ఉత్సాహంగా మాట్లాడారు.


రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్య అందాలనే మంచి సంకల్పంతో మాజీ సీఎం జగన్‌మోన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలో ఏర్పాటుకు పునుకున్నారని కొడాలి నాని అన్నారు. వైసీపీ పాలనలో ఐదు కళాశాలలు పూర్తి చేయగా... మరో ఐదు కళాశాలల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. పేద ప్రజలు, విద్యార్థులకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, హాస్పిటల్స్ ప్రైవేటీకరణ దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలుపెట్టారన్నారు.


తాము తలపెట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చిందని చెప్పారు. ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాభిష్టానికి అనుకూలంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఉద్యమంలో తాము సేకరించిన వినతి పత్రాలను వైసీపీ అధినేత జగన్ నాయకత్వంలో గవర్నర్‌కు అందజేయనున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

రెండో విడత ల్యాండ్ పూలింగ్.. రైతుల అంగీకారం

సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 01:16 PM