Home » Kodali Nani
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అనుచరుడు నకిలీ పోలీసు అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొడాలి నాని అనుచరుడిపై పోలీసులకి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి ఆటకట్టించారు.
వైసీపీ నేత కొడాలి నానికు నేటితో విముక్తి లభించింది. ఆయన బెయిల్ షరతుల గడువు నేటితో పూర్తి అయింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో బెయిల్ పొందిన కొడాలి నానికు..
గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా సమయంలో దాతలు ఇచ్చిన వస్తువులు, దుప్పట్లు, మాస్కులు శానిటైజర్లు, ఆక్సిజన్ పరికరాలు, నగదుతో కొనుగోలు చేసిన బెడ్లు తదితరాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, వారిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదులు అందాయి.
మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Gudivada Flexi War: టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడలో రాజకీయం హీటెక్కింది. వరుసగా రెండు రోజుల నుంచి పేర్నినాని చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు.
Kodali Nani Court Violation: కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మాజీ మంత్రి కొడాలి నాని.. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కలిసి ఇంటి వద్ద నుంచి స్టేషన్‌కు వచ్చి మరీ సంతకాలు చేశారు.
వస్త్ర దుకాణంపై దాడి కేసులో గుడివాడ కోర్టు మాజీ మంత్రి కొడాలి నానికి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని సుదీర్ఘ విరామం తర్వాత కనిపించారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు కొడాలి నాని హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని వచ్చారు.
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కొడాలి నానిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అమెరికాకు పరారయ్యే అవకాశం ఉండటంతో ఎయిర్పోర్టులకు అలర్ట్ పంపారు.