Gudivada Government Hospital: చర్యలకు సిద్ధం!
ABN , Publish Date - Aug 06 , 2025 | 07:40 AM
గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా సమయంలో దాతలు ఇచ్చిన వస్తువులు, దుప్పట్లు, మాస్కులు శానిటైజర్లు, ఆక్సిజన్ పరికరాలు, నగదుతో కొనుగోలు చేసిన బెడ్లు తదితరాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
» వైసీపీ హయాంలో గుడివాడ ఏరియా ఆస్పత్రిలో అక్రమాలు
» 2020లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చిన ఏసీబీ అధికారులు
» ఐదేళ్లుగా చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టిన అధికారులు
» దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
» 11 మందిపై విచారణకు మంగళవారం ఆదేశాలు జారీ
ఆంధ్రజ్యోతి- గుడివాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో గుడివాడ ఏరియా ప్రభుత్వాస్పత్రిపై (Gudivada Government Hospital) అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కరోనా సమయంలో దాతలు ఇచ్చిన వస్తువులు, దుప్పట్లు, మాస్కులు శానిటైజర్లు, ఆక్సిజన్ పరికరాలు, నగదుతో కొనుగోలు చేసిన బెడ్లు తదితరాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై 2013లో ఏసీటీ అధికారులు రెండు రోజులపాటు ఆస్పత్రిలో తనిఖీలు చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఇందిరాదేవి గత వైసీపీ ప్రభుత్వం నుంచి నేటి వరకు కొనసాగుతున్నారు. కరోనా సమయంలో అప్పటి మంత్రి కోవాలి నాని కార్యాలయం నుంచి వచ్చిన సిఫార్సులకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చి బెడ్లను కేటాయించారు. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి కొడాలి వానిలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాజీ మంత్రి కొవాలి నాని చక్రం తిప్పి నిలుపుదల చేయించినట్లు సమాచారం.
అంతా మాజీ మంత్రి కనుసన్నల్లోనే..
అవినీతి ఆరోపణలు ఉన్న సూపరింటెండెంట్ వైద్యులపై చర్యలు తీసుకోకుండా అప్పటి మంత్రి కొవాలి నాని చక్రం తిప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వారికి విశ్వాసపాత్రులుగా వ్యవహరించడంతోనే అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నానిపై ఒత్తిడి తీసుకువచ్చి చర్యలకు ఉపక్రమించకుండా నిలుపుదల చేసినట్లు సమాచారం. కరోనా సమయంలో మంత్రి క్యాంపు కార్యాలయం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సిఫారసు చేసిన వారికే సమకూర్చారు. బెడ్‌లు అందుబాబులో లేకపోవడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకంగా దాతలిచ్చిన పరికరాలు, బెడ్‌లు, నగదు, వస్తువులు పక్కవారి పట్టినట్టు సమాచారం.
11 మందిపై విచారణకు మంత్రి ఆదేశం
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వా స్పత్రుల్లో నెలకొన్న అక్రమాలపై చర్యలకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ఆదేశాలిచ్చారు. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో 2020లో ఏసీబీ జరిపిన మరో తనిఖీలో నివేదిక ఆధారంగా మంత్రి సత్యసమార్ జూలై 27వ తేదీన 22 మంది వైద్యులు, ఇతర సిబ్బందిపై విచారణకు ఆదేశించారు. ఇవి జరిగి రెండు వారాలు తిరగకముందే గుడివాడ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన అవకతవకలపై నాటి ఏసీబీ అధికారుల నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు.
ఏసీబీ నివేదిక ఇచ్చి ఐదేళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ఆస్పత్రి సూపరింటెండెంట్, అరుగురు వైద్యులు, పరిపాలనాధికారి(ఏవో), ఇద్దరు వర్సింగ్ సూపరింటెండెంట్లు, ఫార్మసిస్టులపై విచారణకు మంత్రి సత్యకుమార్ మంగళవారం ఆదేశాలిచ్చారు. ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి 2014-16 కాలంలో వచ్చిన అంతర్గత ఆడిట్ నివేదికలపై చర్యలు తీసుకోకపోవడంపై సీరియస్ అయ్యారు.
లోతైన పరిశీలన
అవినీతి నిరోధక శాఖ అధికారులు 2000లో రెండు రోజులపాటు ఏరియా ఆస్పత్రి నిర్వహణ, పరిశుభ్రత అంతర్గత ఆడిట్ రిపోర్టులపై తీసుకున్న చర్యలు, రోగులకు అందించే భోజనంలో నాణ్యత, మందుల నాణ్యత, సరఫరా, స్టాకు వివరాలు, నియమాల ప్రకారం వైద్య సిబ్బంది పాటించాల్సిన డ్రెస్ కోడ్ వంటి వాటిపై లోతైన పరిశీలన చేశారు. అప్పటి వైద్య సిబ్బందిని పలు అంశాలపై నేరుగా ప్రశ్నించారు. వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ లోపాన్ని అప్పటి ఏసీబీ అధికారులు ఎత్తిరూపారు. రోగ నిర్ధారణ పరీక్షల కోసం వాడే పలు రకాల కిట్లు, గ్లౌజులు పంపు షెడ్డు.. ప్లంబర్ రూమ్, ఇతర చోట్ల చెల్లాచెదురుగా ఉండటాన్ని గమనించారు.
దీర్ఘకాలంగా రాష్ట్రప్రభుత్వం సమకూర్చిన వాహనాలను తీసివేయలేదని, వాహన డ్రైవర్‌ను వేరే పనులకు వినియోగించుకుని లక్షల రూపాయల జీతం చెల్లించడాన్ని గుర్తించారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఆపరిశుభ్రత ఉన్నట్లు గమనించారు. రోగులకు అందించే భోజనం విషయంలో నాణ్యతాలోపం ఉందని... మెనూ ప్రకారం ఏ రోజు భోజనం పెట్టిన దాఖలాలు లేవని నిర్ధారించారు. ముఖ్యంగా రోగులకు గుడ్డు సరఫరాలో చేతివాటం చూపించారని, రోగులకు ఇచ్చే మందుల సరఫరా, బ్లాక్ రిజిస్టర్‌లో వ్యత్యాసాలు, ప్రతి రోజు రోగులు మంచాలపై దుప్పట్లు మార్చకపోవడం వంటి విషయాలను నివేదికలో పొందుపరిచారు.
మంత్రి ఆదేశించినా చర్యల్లేవ్!
రెండు నెలల క్రితం ఆస్పత్రిని పరిశీలించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సూపరింటెండెంట్ ఇందిరాదేవి వివాదాస్పద వ్యవహారశైలిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. అయినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వైసీపీ ప్రభుత్వం నుంచి నేటి వరకు ఆమె సూపరింటెండెంట్ కొనసాగుతుండటం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్కాతమ్ముళ్లను కలిపిన ఆంధ్రజ్యోతి
25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
For More AP News and Telugu News