Home » Gudivada
కృష్ణా జిల్లాలోని గుడివాడలో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు 48 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గండికోట శివపార్వతి ఇంట్లో భారీ చోరీ జరిగింది.
కృష్ణాజిల్లాలోని గుడివాడలో చిట్టీల వ్యాపారం పేరుతో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై గుడివాడ వన్‌టౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు.
గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
కృష్ణా జిల్లాలోని గుడివాడ నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి(50) పాయిజన్ టాబ్లెట్లు మింగి బలవన్మరణానికి యత్నించింది.
కృష్ణా జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు మెరుగుమాల ఖాళీ పుట్టినరోజు పార్టీలో రచ్చ చోటు చేసుకుంది. గుడివాడ టీచర్స్ కాలనీలోనీ ఓ భవనం పైఅంతస్తులో 100 మందితో అర్ధరాత్రి మద్యం పార్టీ నిర్వహించారు.
రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు గుడివాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేదికలను అధికారులు ఖరారు చేశారు.
కృష్ణాజిల్లా గుడివాడలో బైండోవర్ ఉల్లంఘించిన గొల్లపల్లి పోతురాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించామని డీఎస్పీ పి. శ్రీనివాస్ వెల్లడించారు. సెక్షన్ 129(ఇ) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్‌లో అతడు ఉన్నారన్నారు.
గుడివాడలోని ప్రసిద్ధ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత హుటాహుటిన ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు.
రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వల్లభనేని బాబురావు తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని తన స్వగృహంలో కన్నుమూశారు.