Share News

Kodali Nani Follower: కొడాలి నానికి ఊహించని షాక్.. ప్రధాన అనుచరుడు అరెస్ట్..

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:10 PM

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుడు కూనసాని వినోద్‌ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

Kodali Nani Follower: కొడాలి నానికి ఊహించని షాక్.. ప్రధాన అనుచరుడు అరెస్ట్..
Kodali Nani Follower

గుడివాడ, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానికి (Kodali Nani) ఊహించని షాక్ తగిలింది. ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారుడు కూనసాని వినోద్‌ను (Koona sani Vinod) గుడివాడ వన్ టౌన్ పోలీసులు ఇవాళ(శుక్రవారం) అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ (Cricket Betting) ఆడుతుండగా వినోద్‌ను పట్టుకున్నారు. వినోద్ దగ్గరి నుంచి రూ.50వేలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.


వైసీపీ ప్రభుత్వంలో అడ్డూ ఆదుపు లేకుండా పేకాట శిబిరాలను వినోద్ నిర్వహించారని పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వంలోనూ ఆయన పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. సమాచారం అందడంతో వెంటనే గుడివాడ వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 19 , 2025 | 12:19 PM