Maoists: పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
ABN , Publish Date - Dec 19 , 2025 | 08:04 AM
ప్రసాదంపాడులో నలుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే వీరిని విజయవాడ ఎంఎస్జే కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చింది.
విజయవాడ, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): ప్రసాదంపాడు వద్ద నలుగురు మావోయిస్టులు (Maoists) పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరిని విజయవాడలో విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు (AP Police) ఎంఎస్జే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మావోయిస్టులను విచారించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.
ఈ విచారణలో కొంతమంది కీలక వ్యక్తుల గురించి, వారి సంఘటిత కార్యకలాపాల గురించి మరింత సమాచారం సేకరించే ఛాన్స్ ఉంది. ఈ పిటీషన్‌పై వాదోపవాదాలు జరిపిన తర్వాత, న్యాయస్థానం మావోయిస్టులను పోలీసుల కస్టడీకి ఇవ్వాలని ఆదేశించింది. అందువల్ల, ఈ వారాంతంలో (శుక్రవారం నుంచి ఆదివారం వరకు) వీరిని నెల్లూరు జైల్లో విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వంశీకి ఊహించని షాక్.. మరో కేసు నమోదు
గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్
Read Latest AP News And Telugu News