Vallabhaneni Vamsi: వంశీకి ఊహించని షాక్.. మరో కేసు నమోదు
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:33 AM
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో వల్లభనేని వంశీపై ఇవాళ(గురువారం) కేసు నమోదైంది.
విజయవాడ, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) ఊహించని షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో వల్లభనేని వంశీపై ఇవాళ(గురువారం) కేసు నమోదైంది. సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదు చేశారు. 2024లో జులైలో తనపై వంశీ ఆయన అనుచరులు దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీతో సహా మరో ఎనిమిది మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, సత్యవర్థన్‌ను వంశీ అండ్ కో కిడ్నాప్ చేసి దాడి చేశారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 2023లో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. అయితే ఈ దాడిలో ప్రధాన సాక్షిగా సత్యవర్థన్ ఉన్నారు. ఈ ఘటనలో ఆయన ఇచ్చిన ఫిర్యాదే కీలకంగా మారింది. ఈ క్రమంలో సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. 2024 జులైలో తనపై వంశీ అండ్ కో దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో సత్యవర్థన్ తెలిపారు. దీంతో వంశీతో పాటు మరో ఎనిమిది మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత
ముగిసిన భవానీ దీక్షలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..
Read Latest AP News And Telugu News