Jagan Meet Governor: గవర్నర్‌ను కలవనున్న జగన్.. పోలీసులు అలర్ట్
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:04 AM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. గవర్నర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
విజయవాడ, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఇవాళ (గురువారం) వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) కలవనున్నారు. గవర్నర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై సేకరించిన కోటి సంతకాల ప్రతులు గవర్నర్‌కు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలవనుండటంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. గవర్నర్‌ను కలిసేందుకు భారీ ర్యాలీతో వెళ్లాలని వైసీపీ నేతలు ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంతో లోక్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. లోక్‌భవన్, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలోని లోక్ భవన్, దాని పరిసర ప్రాంతాలు రాజ్యాంగ కార్యాలయం, అత్యంత భద్రత కలిగిన కీలక మౌలిక సదుపాయాల ప్రాంతం, ప్రజాశాంతి, భద్రత, ట్రాఫిక్ నిర్వాహణ దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, నియంత్రణలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
అలాగే, ఇవాళ (గురువారం) లోక్‌భవన్ పరిసరాల్లో, ఎంజీ రోడ్డుపై, సివిల్ కోర్ట్స్, స్టేట్ గెస్ట్‌హౌస్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏ విధమైన ప్రజా ర్యాలీలు, పాదయాత్రలు, ప్రదర్శనలు లేదా సమావేశాలు నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కేవలం పోలీస్ శాఖ నుంచి ముందస్తుగా అనుమతి పొందిన పరిమిత సంఖ్యలో ప్రతినిధులు మాత్రమే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి, అనంతరం లోక్ భవన్‌లో వినతి పత్రం సమర్పించేందుకు అనుమతి ఇచ్చామని.. ఇతరులు ఎవరూ రాకూడదని పోలీసులు స్పష్టం చేశారు.
నిబంధనలివే..
లోక్‌భవన్ పరిసరాలు, ఎంజీ రోడ్డుపై గుమికూడొద్దు.
ర్యాలీలు, పాదయాత్రలు, వాహనాల ఊరేగింపులు నిర్వహించొద్దు.
డీజేలు, లౌడ్ స్పీకర్లు, డ్రోన్లు వంటివి ఉపయోగించరాదు.
ఈ సూచనలు BNSS, పోలీస్ యాక్ట్, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం అమల్లో ఉన్నాయని తెలిపారు.
ఏపీవ్యాప్తంగా ప్రజలందరూ ఈ సూచనలను గౌరవించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత
ముగిసిన భవానీ దీక్షలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..
Read Latest AP News And Telugu News