Massive Fire Breaks Out: గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం.. షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎగసిపడుతున్న మంటలు..
ABN , Publish Date - Dec 14 , 2025 | 08:43 AM
ఆదివారం తెల్లవారుజామున నెహ్రూ చౌక్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న సెల్‌ఫోన్ షాపులో ప్రమాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే మంటలు సెల్ ఫోన్ షాపు నుంచి పక్కన ఉన్న షాపులకు వ్యాపించాయి.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున నెహ్రూ చౌక్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న సెల్‌ఫోన్ షాపులో ప్రమాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే మంటలు సెల్ ఫోన్ షాపు నుంచి పక్కన ఉన్న షాపులకు వ్యాపించాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పడానికి శ్రమిస్తున్నారు. భారీ మంటలతో సమీప ప్రాంతాల నివాసదారులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోనుంచి రోడ్లపైకి వచ్చేశారు.
అగ్నిమాపక శాఖ అధికారులు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని దుకాణదారులు పరుగుపరుగున కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. షాపులు మంటల్లో కాలిపోవటం చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటతడి సైతం పెట్టుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
పర్యాటకుల స్వర్గధామం రంగురాళ్ల సరస్సులు..
ఓ స్థానంలో ఆడటానికైనా సిద్ధమే:తిలక్ వర్మ