Kodali Nani Follower Arrest: వైసీపీకి బిగ్ షాక్.. కొడాలి నాని అనుచరుడు అరెస్ట్
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:26 PM
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అనుచరుడు నకిలీ పోలీసు అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొడాలి నాని అనుచరుడిపై పోలీసులకి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి ఆటకట్టించారు.
కృష్ణాజిల్లా గుడివాడ, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అనుచరుడు (Kodali Nani Follower) నకిలీ పోలీసు (Fake Police) అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొడాలి నాని అనుచరుడిపై పోలీసులకి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి ఆటకట్టించారు. ఈ నేపథ్యంలో బాధితుడు వెంకటరామయ్య ఫిర్యాదు మేరకు గుడివాడ రూరల్ పోలీసులు (Gudivada Rural Police) కొడాలి నాని అనుచరుడిని ఇవాళ(బుధవారం) అరెస్ట్ చేశారు.
పోలీసు యూనిఫాంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌ను అంటూ... పూజారిని బెదిరించాడు కొడాలి నాని అనుచరుడు. అయితే పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకుని విచారించగా గుడివాడ నియోజకవర్గ వైసీపీ (YSRCP) ప్రచార విభాగ అధ్యక్షుడిగా గుర్తించారు. గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని గంగానమ్మ దేవస్థానం పూజారిని బెదిరించి బలవంతంగా ఆలయ తాళాలు లాక్కున్నాడు కొడాలి నాని అనుచరుడు. ఆలయంలోని వాటర్ బోర్, మోటార్ తీసుకెళ్లాడని బాధితుడు ఆరోపిస్తున్నారు. బాధితుడు వెంకటరామయ్య ఫిర్యాదు మేరకు కొడాలి నాని అనుచరుడుపై 319(2), 308(2), 351(2) BNS సెక్షన్ కింద గుడివాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
భారీ పెట్టబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News