AP Govt: జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Nov 05 , 2025 | 03:20 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రుల బృందం బుధవారం సమావేశమైంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై మంత్రులు చర్చిస్తున్నారు.
అమరావతి, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) జిల్లాల పునర్ వ్యవస్థీకరణ (District Reorganization)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya prasad) నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రుల బృందం (GOM... గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఇవాళ(బుధవారం) సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత పాల్గొన్నారు. వర్చువల్‌గా మంత్రి నారాయణ, సత్య కుమార్ యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై మంత్రులు మాట్లాడుతున్నారు.
జిల్లాల విభజన వల్ల ఉన్న ఇబ్బందులను తీరుస్తామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు జీవోఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే జీఎంవో ప్రాథమికంగా ఇచ్చిన నివేదికపై కొన్ని మార్గదర్శకాలు సీఎం చంద్రబాబు ఇచ్చిన విషయం తెలిసిందే. మండలాలు, పంచాతీయలు విభజన చేయకుండా నియోజకవర్గమంతా ఒకే డివిజన్‌లో ఉండాలని ఇప్పటికే జీఎంవో నిర్ణయించింది.
ఈరోజు మంత్రుల బృందం సమావేశమై తుది నివేదికను రూపొందించి సీఎం చంద్రబాబుకు మంత్రివర్గ ఉప సంఘం అందజేయనుంది. కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణనకు ముందే నివేదిక ఇచ్చేందుకు జీవోఎం ప్రయత్నిస్తోంది. ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై కీలక చర్చలు జరిపి మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి...
ధాన్యం కొనుగోలు డబ్బులు.. 24 గంటల్లోనే
నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు
Read Latest AP News And Telugu News