Home » AP Districts
గత 18 నెలలుగా ఏపీలో సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ హయాంలో జారీ చేసిన జీవోలు ప్రజలకు ఓపెన్ డొమైన్‌లో అందుబాటులో ఉండేవి కావని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో పారదర్శక పాలన అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
తనకు పార్టీ, రాయచోటి నియోజకవర్గ ప్రజలు రెండు కళ్లలాంటివని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాయచోటి విషయంలో బాధ పడుతున్నట్లు సీఎం చంద్రబాబు కూడా చెప్పారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై చర్చించారు.
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెల 27వ తేదీన జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రుల బృందం బుధవారం సమావేశమైంది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై మంత్రులు చర్చిస్తున్నారు.
ఉత్తర కోస్తా జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా అజయ్ జైన్‌ను.. దక్షిణ కోస్తా జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా ఆర్‌పీ సిసోడియాలను నియమించారు.
Earthquakes in AP: ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయపడిపోయారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఓపీఎస్ అమలు చేయాలంటూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) పిలుపుమేరకు బొమ్మూరు కలెక్టరేట్ వద్ద ధర్నాచేశారు. ఈ సందర్బంగా ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం సీపీఎస్ అమలు చేసిన రోజు సెప్టెంబరు 1న వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశామని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది పేదలకు పెద్ద దిక్కు.. అనంతపురం సర్వజన వైద్యశాల. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, వ్యాధులు ప్రబలినా.. పరిగెత్తుకుంటూ పెద్దాసుపత్రికి వస్తారు. వీరిని అత్యవసరంగా పరీక్షించి.. తగిన వైద్యసేవలు అందించి.. ప్రాణాలు కాపాడటంలో కీలకంగా పనిచేసే విభాగం.. క్యాజువాలిటీ..! ఇలాంటి చోట తగినన్ని పడకలు, మౌలిక వసతులు కల్పించాలి. కానీ అలాంటివేవీ కనిపించవిక్కడ..! రోజుకు 300 నుంచి 400 మంది వరకూ రోగులు క్యాజువాలిటీకి వస్తారు. కానీ ఉన్న పడకలు 20 మాత్రమే..! అత్యవసర వైద్యం అందించి.. సంబంధిత విభాగాలకు పంపేందుకు కనీసం గంట పడుతుంది. ...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం...