Share News

Minister DBV Swamy: భారీ పెట్టుబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 05 , 2025 | 03:50 PM

ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుతం ప్రత్యేక చర్యలు చేపట్టిందని విశాఖపట్నం ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన 20లక్షల ఉద్యోగాలని కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు మంత్రి డోలా.

Minister DBV Swamy: భారీ పెట్టుబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక.. మంత్రి డీబీవీ స్వామి కీలక వ్యాఖ్యలు
Minister DBV Swamy On Job Creation

విశాఖపట్నం, నవంబరు5 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుతం ప్రత్యేక చర్యలు చేపట్టిందని విశాఖపట్నం ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Minister Dola Bala Veeranjaneya Swamy) వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలని కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నంలో సాంకేతిక రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.


ఆర్థిక కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. ఇవాళ (బుధవారం) ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే పార్టనర్‌‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి డీబీవీ స్వామి పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు, జిల్లా కలెక్టర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. ఈనెల 14, 15వ తేదీల్లో ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నంలో పార్టనర్‌‌షిప్ సమ్మిట్ జరుగుతుందని వివరించారు. ఈ భాగస్వామ్య సదస్సుకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, కేంద్రమంత్రులతో సహా 20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు మంత్రి డోలా.


ఈ పార్టనర్‌‌షిప్ సమ్మిట్ ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల ఆహ్వానానికి అవకాశాలు ఉన్నాయని వివరించారు. భారీ పెట్టుబడులు, ఒప్పందాలకు విశాఖ వేదిక కాబోతోందని ఉద్ఘాటించారు. ఈ పార్టనర్‌‌షిప్ సమ్మిట్ ద్వారా సుమారు 410 ఒప్పందాలు జరుగుతాయని వెల్లడించారు. అలాగే, 7.5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని నొక్కిచెప్పారు. భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఒప్పందాలు, పరిశ్రమలకు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి పేర్కొన్నారు.


డయాలసిస్ మిషన్లని ప్రారంభించిన మంత్రి డీబీవీ స్వామి..

మరోవైపు..విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రి నెఫ్రాలజీ విభాగంలో 9 హిమో డయాలసిస్ మిషన్లను మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, కేజీహెచ్ వైద్యులు పాల్గొన్నారు. సీఎస్‌ఆర్‌లో భాగంగా ఎన్‌టీపీసీ రూ.2కోట్ల వ్యయంతో 9 హిమో డయాలసిస్‌లని సమకూర్చింది. నెఫ్రాలజీ విభాగానికి 9 హిమో డయాలసిస్ మిషన్లను సమకూర్చిన ఎన్‌టీపీసీకి మంత్రి డీబీవీ స్వామి ధన్యవాదాలు తెలిపారు.


ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తోందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ ఆస్పత్రులను తాము బలోపేతం చేస్తున్నామని నొక్కిచెప్పారు. సంజీవిని పేరుతో హెల్త్ రికార్డులను డిజిటలైజేషన్ చేస్తున్నామని వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద కుప్పంలో సంజీవిని ప్రాజెక్టును ప్రారంభించామని వెల్లడించారు. కేజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగం ఉత్తమ సేవలను అందిస్తుందని మంత్రి డోల బాలా వీరాంజనేయ స్వామి ప్రశంసించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 05:30 PM