Home » Dola Sree Bala Veeranjaneya Swamy
ఏపీలో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎటువంటి సర్వీస్ రూల్స్ లేకుండా 1.24 లక్షల మందిని నియమించి నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
జగన్ అస్తవ్యస్తంగా రూపొందించిన సచివాలయ వ్యవస్థను తాము చక్కదిదుతున్నప్పటికీ... ఉద్యోగులు ఆందోళనకు దిగడమేంటని ప్రభుత్వం ప్రశ్నించింది. మంచి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ, స్వర్ణగ్రామ,స్వర్ణవార్డు శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ విధ్వంసం సృష్టించాలని చూస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే.. రాజకీయంగా అడ్డంకులు సృష్టించడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు.
వెలిగొండ ప్రాజెక్టుకు ఈనెల 31వ తేదీన సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేస్తారని ఏపీ మంత్రి బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం వెలిగొండకు నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్కులు అందజేశారు. బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో సీఎం చంద్రబాబును ప్రాజెక్టు నిర్వాసితులు కలిశారు.
ఏపీలో 16 వేలకుపైగా డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీలో వైసీపీ నేతలు నానాయాగి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం పాకులాడుతూ జగన్ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
రిషికొండ ప్యాలెస్‌ను టూరిజం రిసార్ట్‌గా అభివృద్ధి చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయించిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.