Share News

Minister DBV Swamy: ప్రతిష్టాత్మకంగా ‘ముస్తాబు’ నిర్వహిస్తాం: మంత్రి డీబీవీ స్వామి

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:29 AM

విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు ఏపీ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

Minister DBV Swamy: ప్రతిష్టాత్మకంగా  ‘ముస్తాబు’ నిర్వహిస్తాం: మంత్రి డీబీవీ స్వామి
Minister Dola Bala Veeranjaneya Swamy

ప్రకాశం, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి (Minister Dola Bala Veeranjaneya Swamy) సూచించారు. ఇవాళ(శనివారం) పొన్నలూరులో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ పి. రాజబాబు పాల్గొన్నారు. గ్రామంలో రూ.65 లక్షల విలువైన రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా మంత్రి డీబీవీ స్వామి మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని నిర్మించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు ఏపీ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ముస్తాబు కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పాఠశాలలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నరమేధమే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 11:36 AM