జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కీలకమైన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మార్కాపురం జడ్పీ చైర్మన్ పదవి అన్‌రిజర్వుడ్ కాగా, ప్రకాశం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. దీంతో టీడీపీకి చెందిన ఎర్రగొండపాలెం, దర్శి ఇన్చార్జులు ఎరిక్షన్‌బాబు, గొట్టిపాటి లక్ష్మిల ఆశలు గల్లంతయ్యాయి.
ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టిన సీఎం చంద్రబాబునాయుడు తన వాగ్దానాన్ని నిలుపుకొనే క్రమంలో ఈ ఏడాది కొత్త డీఎస్సీ ప్రకటించారు.
గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో తదనుగుణంగా రిజర్వేషన్లను చేపట్టారు.
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వేటపాలెం రావూరి రోడ్డు సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది.
పేద వర్గాలకు చెందిన వారికి కూడా కార్పోరేట్ వైద్యం అందించాలన్నదే సీఎంఆర్ఎఫ్ విధాన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. రూ.67.44లక్షలతో నూతనంగా నిర్మించిన స్వర్ణ గ్రామ, రైతు సేవా కేంద్ర భవనాలతో పాటు, సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రూ.11.50లక్షలతో నిర్మించిన వాటర్ ప్లాంట్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు.
అభివృద్ధే లక్ష్యంగా ప్రభు త్వ పాలన జరుగుతోందని ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని నికరంపల్లి గ్రామంలో పంచాయతీ భవనం, గ్రామ ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్లను మంగళవారం అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.
అద్దంకి, గిద్దలూరు, పర్చూరులో 220కేవీ సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేసి రూ.35.78 కోట్లతో నిర్మించనున్న 132/33కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు.
గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం ఒంగోలు శివారు ప్రాంతంలోని పల్నాడు ఫర్నీచర్ సమీపంలో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగిన యువతి అనుమానాస్పదరీతిలో మృతి చెంది ఉంది.
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి మల్లవరం దగ్గర చోటుచేసుకుంది.