Share News

వందపడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు కృషి

ABN , Publish Date - Feb 22 , 2026 | 01:28 AM

మార్టూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటరును వందపడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అ న్నారు.

వందపడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు కృషి

మార్టూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): మార్టూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటరును వందపడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అ న్నారు. ఆయన శనివారం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. 2014-19ల కాలంలో టీడీపీ ప్రభుత్వం హయాంలోనే రెండున్నర కోట్ల రూపాయల నిధులతో నూతనంగా ఆస్పత్రి భవనం, వసతులను ఏర్పాటు చేశామన్నారు. తద్వారా రోజుకు ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులలో రోగులు సేవలు పొందు తున్నారన్నారు. అందువలన ఈ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌గా చేయవలసిన అవసరం ఉంద న్నారు. అదేవిఽధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటు న్నామన్నారు. అందులో భాగంగా రూ.11 లక్షలతో ఆస్పత్రి భవనం మరమ్మతులు చేపట్టామన్నారు. రూ.10 లక్షలతో ఆస్పత్రి ఆవరణలో సీసీ రోడ్లు నిర్మాణం చేపడుతున్నారు. అంతేగాకుండా రూ.38 లక్షలతో పోస్టు మార్టం భవననిర్మాణం, రూ.28 లక్షలతో ఆయుష్‌ డిస్పెన్సరీ నూతన భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయన్నారు.

రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే

ఆస్పత్రిలోని అన్నివార్డులలో తిరుగుతూ, రోగులతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఏలూరి వైద్యులు అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. రోగులకు సక్రమంగా వైద్యసేవలను వైద్యులు అందిస్తున్నారా...? అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులకు అన్ని రకాల వైద్యపరీక్షలను అందుబాటులో ఉండేవిధంగా చేయాలని వైద్యులను కోరారు. ఆస్పత్రి ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఆస్పత్రిలో అమలవు తున్న బయోమెడికల్‌ వ్యర్థాల బార్కోడ్‌ ఆధారిత ట్రాకింగ్‌ వ్యవస్థను ఎమ్మెల్యే పరిశీలించారు. నూతనం గా భవన నిర్మాణం జరుగుతున్న ఆయుష్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణం నాణ్యంగా ఉండాలన్నారు.

చెత్తరిక్షాలు అందజేత

పారిశుధ్య కార్మికులకు మార్టూరు గ్రామ పంచా యతీ వారు మంజూరుచేసిన నూతన రిక్షాలు, డస్ట్‌బిన్‌ లను వారికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేతుల మీదగా పంపిణీ చేశారు. అనంతరం స్వచ్చభారత్‌ పై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ షేక్‌ఫరూక్‌, కామినేని జనార్దన్‌, షేక్‌ రజాక్‌, ్లకమ్మశివ నాగేశ్వరరావు, కాకోలు వెంకటేశ్వర్లు, తొండెపు ఆదినారాయణ, కామేపల్లి హరిబాబు, ఆస్పత్రి సూపరిడెంట్‌ గార్గేయ, వైద్యులు అశోక్‌ రెడ్డి, సిద్దార్ద, కిషోర్‌, మార్టూరు ఈవో తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 01:28 AM