సాగు, తాగునీటి సమస్యలపై దృష్టి
ABN , Publish Date - Feb 21 , 2026 | 02:09 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నిర్వహించే ప్రకాశం, మార్కాపురం జిల్లాల సమా వేశంలో సాగు, తాగునీటికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ముందస్తు సమావే శంలో రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు నిర్ణయిం చారు. శుక్రవారం విజయవాడలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం నివాసంలో సమావేశం జరిగింది.
అక్కడ వెలిగొండ.. ఇక్కడ జలజీవన్
కలెక్టర్, ఎస్పీలను కొనసాగించాలి
ముందస్తు సమావేశంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్ణయం
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం నిర్వహించే ప్రకాశం, మార్కాపురం జిల్లాల సమా వేశంలో సాగు, తాగునీటికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ముందస్తు సమావే శంలో రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు నిర్ణయిం చారు. శుక్రవారం విజయవాడలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం నివాసంలో సమావేశం జరిగింది. జిల్లాకు చెందిన మంత్రి స్వామితోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌చార్జిలు, కలెక్టరు, ఎస్పీ పాల్గొ న్నారు. ముఖ్యమంత్రి, రెండు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీలతో ఆదివారం సమావేశం కానున్నారు. ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రధానంగా సమీక్షిస్తారు. ఆ సందర్భంగా జిల్లా తక్షణ, శాశ్వత అభివృద్ధిపై నేతల వాణిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ సమావేశంలో విభిన్న అభిప్రాయాలు కాకుండా అందరూ ఏకాభిప్రాయంగా మాట్లాడాలన్న ఉద్దేశంతో శుక్రవారం వీరు సమావేశమయ్యారు. సీఎం వద్ద సమావేశానికి దర్శి, వైపాలెం ఇన్‌చార్జిలు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబు హాజరుకాకపోవచ్చని భావించారు. అందువల్ల ముందుగా వారి నియోజకవర్గాల సమస్యలను మంత్రులు, అధికారులు తెలుసుకున్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల వారీ ఎమ్మెల్యేలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలను తెలుపగా వాటిని మంత్రులు, కలెక్టరు నమోదు చేసుకున్నారు. ఇదేసమయంలో మార్కాపురం జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి సీఎం చూపుతున్న శ్రద్ధను అభినందిస్తూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం కోసం పూర్తిస్థాయిలో నిధులు విడుదలకు విజ్ఞప్తి చేయనున్నారు. మార్కాపురం జిల్లాలోని నియోజకవర్గాలలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభమైనందున ఆ పథకం రెండు, మూడు విడతల్లో ప్రకాశం జిల్లా పరిధిలోని నియోజకవర్గాలను చేర్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే తీగలేరు, మోపాడు, రాళ్లపాడు రిజర్వాయరు, కంభం చెరువులాంటి సాగునీటి వనరులు ఆయా ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాల అంశాలను సీఎం వద్ద ప్రస్తావించాలని తీర్మానించుకున్నారు.
వారినే కొనసాగించండి
మరికొంతకాలం మార్కాపురం జిల్లాకు ప్రకాశం కలెక్టరు రాజాబాబును, ఎస్పీగా హర్షవర్థన్‌రాజునే ఇన్‌చార్జిలుగా కొనసాగించాలని ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కోరాలని నిర్ణయించుకున్నారు. ప్రారంభంలోనే ఎమ్మెల్యేలంతా కోరడంతో మార్చి వరకు వారినే కొనసాగించేందుకు సీఎం కూడా అంగీకరించినట్లు తెలిసింది. అయితే ఇటీవల మార్కాపురం జిల్లాకు కొత్త కలెక్టరు, ఎస్పీలను నియమించే ఆలోచనతో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కొన్ని ప్రతిపాదనలను సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు మార్చిలో ఆ జిల్లాకు కొత్త కలెక్టరు, ఎస్పీలను నియమించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఆదివారం నాటి సమావేశంలో ఆ ఇద్దరినీ మరికొంతకాలం కొనసాగించే విధంగా సీఎంను కోరాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు మంత్రులు, ఎంపీ మాగుంటతోపాటు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్రనరసింహారెడ్డి, నాగేశ్వరరావు, అశోక్‌రెడ్డి, టీడీపీ ఇన్‌చార్జిలు ఎరిక్షన్‌బాబు, లక్ష్మితోపాటు కలెక్టరు, ఎస్పీలు పాల్గొన్నారు.