Share News

ఇంటర్‌ పరీక్షలు సుదీర్ఘం

ABN , Publish Date - Feb 22 , 2026 | 02:35 AM

ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘంగా నెలరోజులపాటు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటాయి. గతంలో కేవలం 14 రోజులలో పరీక్షలు ముగిసేవి. ఈసారి 23 సబ్జెక్టులకు నెలరోజులపాటు కొనసాగనున్నాయి.

ఇంటర్‌ పరీక్షలు సుదీర్ఘం

రేపటి నుంచి ప్రారంభం

నెలరోజుల పాటు ప్రక్రియ

రోజుకొక సబ్జెక్టు నిర్వహణ

సరికొత్త సంస్కరణల ఫలితం

ఒంగోలు విద్య, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘంగా నెలరోజులపాటు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటాయి. గతంలో కేవలం 14 రోజులలో పరీక్షలు ముగిసేవి. ఈసారి 23 సబ్జెక్టులకు నెలరోజులపాటు కొనసాగనున్నాయి. ఇంటర్‌ విద్యలో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా రోజుకొక సబ్జెక్టు మాత్రమే నిర్వహించాల్సి రావడంతో సుదీర్ఘకాలం జరగను న్నాయి. గతంలో ఉన్న సబ్జెకు కాంబినేషన్లకు భిన్నంగా ఆరో సబ్జెక్టు పేపర్‌-2లో ఆప్షనల్‌గా విద్యా ర్థులు ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వడంతో పరీక్షల నిర్వహణ రోజుల సంఖ్య పెరిగింది. సైన్స్‌ విద్యార్థులు ఆర్ట్స్‌ సబ్జెక్టులో, ఆర్ట్స్‌ వారు సైన్స్‌ సబ్జెక్టులను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్‌ ఇవ్వడంతో అనివార్యంగా ప్రతి సబ్జెక్టుకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. గతంలో ఎంపీసీ విద్యార్థులకు గణితం పరీక్ష నిర్వహించే రెండు రోజుల్లో బైపీసీ వారికి బోటనీ, జువాలజీ, ఆర్ట్స్‌ విద్యార్థులకు సివిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌, హిస్టరీ పరీక్షలు నిర్వహించేవారు. దీంతో వారంరోజులకే ఒక్కో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేవి. అదే ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 11 రోజులు, ప్రథమ వారికి 12 రోజులు మొత్తం 23 సబ్జెకులకు పేపర్లను 23 రోజులు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ఫస్టియర్‌ వారికి గణితం పేపర్‌-1ఎ, 1బీకి బదులు ఈ సంవత్సరం పేపర్‌-1 మాత్రమే 100 మార్కులకు నిర్వహిస్తారు. బోటనీ, జువాలజీ రెండూ కలిపి బయాలజీ పేరుతో ఒకే పరీక్ష ఉంటుంది.

పరీక్షల నిర్వహణ షెడ్యూలు ఇలా..

ప్రథమ సంవత్సరం విద్యార్ధులకు ఈనెల 23న తెలుగు/ సంస్కృతం/ఉర్దూ/ హిందీ/ తమిళం/ఒరియ/కన్నడ/ఫ్రెంచ్‌/పర్షియన్‌ భాషలు పేపర్‌-1 పార్ట్‌-2, ద్వితీయ భాష పేపర్‌-1లో బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు నిర్వహిస్తారు. 25న ఇంగ్లీష్‌ పరీక్ష రెగ్యులర్‌ విద్యార్థులు, బ్యాక్‌లాగ్‌లకు 27న హిస్టరీ రెగ్యులర్‌లకు, బోటనీ, హిస్టరీ బ్యాక్‌లాగ్‌ వారికి, మార్చి 2న రెగ్యులర్‌లకు గణితం పేపర్‌-1, బ్యాక్‌లాగ్‌ వారికి గణితం-1, మార్చి 5న బయాలజీ పేపర్‌-1, బ్యాక్‌లాగ్‌ వారికి గణితం-1బి, జువాలజీ పేపర్‌-1, 7న రెగ్యులర్‌ వారికి ఎకనామిక్స్‌ పేపర్‌-1, బ్యాక్‌లాగ్స్‌కు ఎకనామిక్స్‌ పేపర్‌-1, 10న రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌లకు ఫిజిక్స్‌ పేపర్‌-1, 12న రెగ్యులర్‌లకు కామర్స్‌ పేపర్‌-1, బ్యాక్‌లాగ్‌లకు కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-1, 14న రెగ్యులర్‌కు సివిక్స్‌ పేపర్‌-1, బ్యాక్‌లాగ్‌లకు సివిక్స్‌, బ్రిడ్జి కోర్సు గణితం-1 (బైపీసీ విద్యార్థులకు), 17న రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌లకు కెమిస్ర్టీ పేపర్‌-1, 21న పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌, లాజిక్‌ పేపర్‌-1, 23న రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు మోడ్రన్‌ లాంగ్వేజి, జాగ్రఫీ పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి.

ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు..

ఈనెల 24న పార్ట్‌-2 ద్వితీయ భాష పేపర్‌-2, 26న ఇంగ్లీష్‌ పేపర్‌-2, 28న బోటనీ, హిస్టరీ పేపర్‌-2, మార్చి 4న గణితం పేపర్‌-2, 6న జువాలజీ, ఎకనామిక్స్‌ పేపర్‌-2, 9న గణితం పేపర్‌-2బి, 11న కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ ఆర్ట్స్‌, మ్యూజిక్‌ పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. 13న ఫిజిక్స్‌ పేపర్‌-2, 16న మోడ్రన్‌ లాంగ్వేజి, జియోగ్రఫీ, గణితం, బ్రిడ్జికోర్సు (బైపీసీ విద్యార్ధులకు) పేపర్‌-2, 18న కెమిస్ర్టీ పేపర్‌-2, 23న పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌, లాజిక్‌ పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయి.

Updated Date - Feb 22 , 2026 | 02:35 AM