Share News

Vijayasai Reddy: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నరమేధమే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 20 , 2025 | 10:51 AM

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందువుల మీద జరుగుతున్న దాడులు నరమేధాన్ని ఖండించని వారు అసలు భారతీయులేనా అని ప్రశ్నించారు.

Vijayasai Reddy: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నరమేధమే.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Vijayasai Reddy

విశాఖపట్నం, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందువులపై జరుగుతున్న దాడులపై భారతదేశం (India) అంతటా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనలు మానవ హక్కుల ఉల్లంఘనగా భావిస్తూ వివిధ వర్గాలు గట్టిగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు పలువురు ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. హిందువులపై జరుగుతున్న హింసను అరికట్టాలని, బాధితులకు రక్షణ కల్పించాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలను తప్పుబట్టారు. అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను ‘నరమేధం’గా అభివర్ణిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న నరమేధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందువుల మీద జరుగుతున్న దాడులు నరమేధాన్ని ఖండించని వారు భారతీయులేనా? అని ప్రశ్నించారు. ఈ దాడులపై ఖండించని వారికి రాజకీయ పార్టీలకు భారతదేశంలో ఉండే నైతిక హక్కు ఉందా? అని నిలదీశారు. వీటిని ఖండించలేని వారిని మనమే దేశం నుంచి బహిష్కరిస్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.


మొత్తంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల అంశం భారత దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలపై మౌనం వహించడం దేశానికి, మానవత్వానికి ద్రోహమని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 11:13 AM